Honda City Price: సిటీ కారు ధరను పెంచిన హోండా.. ప్రస్తుతం ధర ఎంతంటే.??

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఇటీవల 2023 సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఈ కొత్త అప్‌డేటెడ్‌ హోండా సిటీ సెడాన్ మోడల్ ధర రూ.11.49 లక్షల నుంచి మొదలవుతున్నాయి. కాగా కొత్త సంవత్సరంలో ఈ కారు ధర పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.

కొత్త ఏడాదిలో హోండా కార్స్ ఇండియా(Honda Cars India) తన లైనప్‌లోని కార్ల ధరలను సవరించినట్లు ప్రకటించింది. దీంతో హోండా కంపెనీకి చెందిన ప్రముఖ మోడల్ హోండా సిటీ ధర మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఐదవ తరం హోండా సిటీ ధర పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.

Honda-City-Facelift

ప్రస్తుతం భారత మార్కెట్లో ఐదవ తరం హోండా సిటీ(Honda City Facelift New Price) ధర రూ. 8000 పెరిగినట్లు హోండా కార్స్‌ ఇండియా ప్రకటించింది, ఈ కొత్త హోండా సిటీ కారు ప్రారంభ ధర రూ.11.71 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది.

మార్కెట్లో హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ SV, V, VX మరియు ZX వేరియంట్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 1.5-లీటర్, నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 120 BHP మరియు 145 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Honda-City-Facelift

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ ఇంజిన్‌ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో మరో ఇంజిన్‌.. 1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్. ఇది 97 bhp గరిష్ట శక్తిని మరియు 127 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రిక్ మోటార్ 108 bhp శక్తిని విడుదల చేస్తుంది.

మొత్తంగా, హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లోని హైబ్రిడ్ సిస్టమ్ 125 bhp మరియు 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త అప్‌డేట్‌తో, సెడాన్ సెగ్మెంట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు హోండా సిటీ కారు యత్నిస్తోంది. కాగా సాధారణ హోండా ఫ్యాషన్‌లో, సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో మార్పులు చాలా తక్కువగా ఉన్నాయి.

Honda-City-Facelift

కాగా హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్‌ ఫీచర్లతో పాటు కొత్త టెక్నాలజీని ఇందులో సంస్థ ప్రవేశపెట్టింది. డిజైన్‌ విషయానికొస్తే ఇందులో ప్రధానంగా బంపర్‌లో మార్పులు చూడవచ్చు. అంతే కాకుండా, ఫ్రంట్‌ మరియు రియర్‌ బంపర్లు కొన్ని కృత్రిమ కార్బన్ ఫైబర్ బిట్స్‌తో అమర్చబడి ఉన్నాయి. ముందు భాగంలో, ఈ కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కారులో బంపర్ ఇప్పుడు కొంచెం స్పోర్టియర్‌ లుక్‌లో ఉంటుంది.

ఫీచర్ల విషయానికొస్తే హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో.. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ ఉన్నాయి. ప్యాడెడ్ డోర్ ప్యాడ్‌లు, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్, ఫోల్డబుల్ ORVMలు, 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌(Honda Facelift)లో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ADAS టెక్నాలజీ సెన్సింగ్ సూట్‌ను అమర్చారు. అప్‌డేటెడ్‌ హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌.. కర్బన ఉద్గార ప్రమాణాలు మరియు E20 ఇంధనానికి అనుగుణంగా రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉండటం కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ అనే చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 9, 2024, 15:30 [IST]
English summary
Honda city facelift prices hiked in january 2024 check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+