హోండా కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్ - ఏ కారుపై ఎంతంటే..

Honda Discount Offers in February 2024: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'హోండా' (Honda) 2024లో ఎంపిక చేసిన కొన్ని కార్ల కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో సిటీ, ఆమెజ్ మరియు 2023 మోడల్ సిటీ ఈ:హెచ్ఈవీ ఉన్నాయి. కంపెనీ ఏ కారుపైన ఎంత తగ్గింపులను అందిస్తోంది? క్యాష్ డిస్కౌంట్ ఎంత? ఇతర ప్రయోజనాలు ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

హోండా సిటీ (Honda City)

ఎక్కువమంది ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేసే హోండా కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ సిటీ. ఇప్పుడు సిటీ కొనుగోలుపైన కంపెనీ గరిష్టంగా రూ. 1.12 లక్షల ప్రయోజనాలను అందిస్తోంది.

Honda City

హోండా సిటీ 2023 కొనుగోలుపైన 40000 రూపాయలు, 2024 మోడల్ మీద రూ.25000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్‌కు బదులుగా రూ. 26947 (2023 మోడల్), రూ. 16196 (2024 మోడల్) ఫ్రీ యాక్ససరీస్ ఎంచుకోవచ్చు. వీటితో పాటు కొనుగోలుదారులు రూ.6000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.25000 కార్పొరేట్ బోనస్, రూ. 4000 లాయల్టీ బోనస్ పొందవచ్చు. హోండా సిటీ ఎలిగెంట్ ట్రిమ్ కొనుగోలుపైన రూ.36500 వరకు స్పెషల్ ఎడిషన్ బెనిఫీట్స్, VS మరియు ZS ట్రిమ్స్ కొనుగోలుపైన రూ.13600 నాలుగు లేదా ఐదు సంవత్సరాల ఎక్స్‌టెండెట్‌ వారంటీ కూడా అందుబాటులో ఉన్నాయి.

అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించే హోండా సిటీ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 హార్స్ పవర్ మరియు 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ప్రస్తుతం హోండా సిటీ ధరలు రూ.11.71 లక్షల నుంచి రూ. 16.19 లక్షల మధ్య ఉన్నాయి.

Honda City e:HEV

హోండా సిటీ ఈ:హెచ్ఈవీ (Honda City e:HEV)

దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలు పొందిన 'హోండా సిటీ ఈ:హెచ్ఈవీ' కొనుగోలుపైన కూడా కంపెనీ ఏకంగా రూ.1 లక్ష క్యాష్ అందిస్తోంది. ఈ బెనిఫీట్ కేవలం 2023 మోడల్‌కు మాత్రమే వర్తిస్తుంది. 2024 సిటీ ఈ:హెచ్ఈవీ కొనుగోలుపైన ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. ఈ కారు ధరలు మార్కెట్లో రూ. 18.89 లక్షల నుంచి రూ. 20.39 లక్షల మధ్య ఉన్నాయి.

హోండా సిటీ ఈ:హెచ్ఈవీ 1.5 లీటర్ ఆర్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజిన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి 109 బీహెచ్‌పీ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఈ మోడల్ పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

Honda Amaze

హోండా అమేజ్ (Honda Amage)

హోండా సంస్థ అమేజ్ కొనుగోలుపైన గరిష్టంగా రూ.92000 ప్రయోజనాలను అందిస్తోంది. 2023 మోడల్ మీద రూ. 45వేలు, 2024 మోడల్ మీద రూ. 30000 క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. క్యాష్ డిస్కౌంట్‌కు బదులుగా రూ.36246 (2023 మోడల్), రూ.12349 (2024 మోడల్) విలువైన యాక్ససరీస్ పొందవచ్చు. ఇవి మాత్రమే కాకుండా రూ. 23000 కార్పొరేట్ బోనస్, రూ. 4000 లాయల్టీ బోనస్ లభిస్తాయి. ఇక ఎలైట్ ట్రిమ్ మీద ప్రత్యేకంగా రూ. 30000 స్పెషల్ బెనిఫీట్స్ ఉంటాయి.

హోండా అమేజ్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 90 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఈ అమేజ్ ధరలు దేశీయ విఫణిలో రూ.7.16 లక్షల నుంచి రూ.9.12 లక్షల మధ్య ఉన్నాయి.

NOTE: హోండా కంపెనీ అందించే డిస్కౌంట్స్ లేదా బెనిఫీట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ ఆఫర్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ యొక్క అధికారిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, February 11, 2024, 11:00 [IST]
English summary
Honda discount offers in february 2024
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+