హోండా ఎలివేట్ కొత్త ధరలు ఇవే.. ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా ఎలివేట్' (Honda Elevate) ధరలు మళ్ళీ పెరిగాయి. కంపెనీ ఈ మోడల్ ధరలను ఎందుకు పెంచింది. ఏమైనా కొత్త అప్డేట్స్ తీసుకువచ్చిందా? అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. ఇప్పుడు ఈ ఎలివేట్ ధరలు గరిష్టంగా రూ. 40000 వరకు పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత ఎలివేట్ ప్రారంభ ధరలు రూ. 11.91 లక్షలు, కాగా టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 16.43 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Honda Elevate

వేరియంట్స్ వారీగా పెరిగిన కొత్త ధరల విషయానికి వస్తే.. రూ.11.58 లక్షల ధర వద్ద ఉన్న SV వేరియంట్ ధర ఇప్పుడు రూ.11.91 లక్షలు. అంటే ఈ వేరియంట్ ధర మునుపటి కంటే కూడా రూ.33000 పెరుగుదలను అందుకుంది. V వేరియంట్ ధర ఇప్పుడు రూ.12.71 లక్షలు. ధరల పెరుగుదలకు ముందు దీని ధర రూ.12.31 లక్షలు. అంటే ఇప్పుడు ఈ వేరియంట్ రూ.40000 పెరుగుదలను నమోదు చేసింది.

V CVT మరియు VX వేరియంట్లు వరుసగా రూ. 30000 మరియు రూ. 40000 పెరుగుదలను నమోదు చేసి.. రూ. 13.71 లక్షలు మరియు రూ. 14.10 లక్షల ధర వద్ద నిలిచాయి. ధరల పెరుగుదలకు ముందు ఈ వేరియంట్ల ధరలు రూ. 13.41 లక్షలు మరియు రూ. 13.70 లక్షలు. VX CVT వేరియంట్ రూ. 30000 పెరుగుదలను నమోదు చేసి రూ. 15.10 లక్షల వద్ద నిలిచింది.

Honda Elevate Rear View

ZX మరియు ZX CVT వేరియంట్లు రూ.31000 మరియు రూ.23000 ధరల పెరుగుదలను నమోదు చేసి రూ.15.41 లక్షలు మరియు రూ. 16.43 లక్షల వద్ద ఉన్నాయి. ధరల పెరుగుదలకు ముందు ఈ కార్ల ధరలు రూ.15.10 లక్షలు మరియు రూ.16.20 లక్షలు. హోండా ఎలివేట్ ధరలు గరిష్టంగా రూ.40000 పెరుగుదలను నమోదు చేసింది, అదే సమయంలో కనిష్టంగా రూ.23000 పెరుగుదలను నమోదు చేసింది.

హోండా కంపెనీ ఎలివేట్ ధరలను పెంచడమే కాకుండా కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేసింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్ మరియు 5 సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ వంటి వాటిని అందిస్తోంది. ఈ కారణంగానే కంపెనీ ధరలను పెంచడం జరిగింది. ఇపుడు ఈ ఫీచర్స్ అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంటాయి.

Honda Elevate Interior

హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 121 హార్స్ పవర్ మరియు 145 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 15.31 కిమీ / లీ మైలేజిని అందిస్తుంది. కాబట్టి ఇది ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 4, 2024, 9:27 [IST]
English summary
Honda elevate price hike up to rs 40000 details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+