అమ్మకాల్లో హోండా ఎలివేట్ అరుదైన రికార్డ్: ఇష్టపడి మరీ కొనేస్తున్న జనం!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎప్పటికప్పుడు కొత్త కార్లను దేశీయ విఫణిలో లాంచ్ చేస్తూ.. తన ఉనికిని చాటుకుంటోంది. ఇందులో భాగంగానే గత ఏడాది కంపెనీ 'ఎలివేట్' SUVని మార్కెట్లో విడుదల చేసింది.
హోండా కంపెనీ 2023లో కొత్త ఎలివేట్ (Elevate) SUVని లాంచ్ చేసినప్పటి నుంచి అద్భుతమైన అమ్మకాలను పొందుతూనే ఉంది. సంస్థ ఈ కారును లాంచ్ చేసిన కేవలం ఆరు నెలల కాలంలో ఏకంగా 30000 యూనిట్ల అమ్మకాలను సాధించగలిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ హోండా కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది ఇట్టే అర్థమైపోతుంది. ఇది అమ్మకాల్లో సాధించిన అరుదైన మైలురాయి అని తెలుస్తోంది.

మిడ్ సైజ్ SUV విభాగంలో విపరీతమైన అమ్మకాలు పొందుతున్న ఎలివేట్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి SV, V, VX మరియు ZX వేరియంట్లు. ఈ SUV ప్రారంభ ధర రూ. 11.58 లక్షలు (ఎక్స్ షోరూమ్). హోండా ఎలివేట్ మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, ఎంజీ గ్లోస్టర్, సిట్రోయెన్ సీ3 మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
దేశీయ విఫణిలో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6600 rpm వద్ద 119 Bhp పవర్ మరియు 4300 rpm వద్ద 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ సీవీటీ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. పనితీరుపరంగా ఇది దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

హోండా కంపెనీ ఇండియన్ మార్కెట్లో అమేజ్, సిటీ వంటి వాటితో పాటు ఎలివేట్ కారును విక్రయిస్తోంది. అంతే కాకుండా సంస్థ ఎలివేట్ SUVని దేశీయ విఫణి నుంచి జపాన్ మార్కెట్ కోసం ఎగుమతి చేయడానికి సిద్ధమంది. అంటే ఈ కారుకు ఒక్క దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఇది జపాన్ దేశంలో WR-R పేరుతో విక్రయిస్తుంది.
హోండా ఎలివేట్ SUV అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు డ్యూయెల్ డిస్ప్లే డ్యాష్ ఉంటుంది. ఇందులోని 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ కారు 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంటుంది.

డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. ఇన్ని కారణాల వల్ల హోండా కంపెనీ యొక్క ఎలివేట్ అద్భుతమైన అమ్మకాలను పొందగలుగుతోంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలుగుతోంది. రాబోయే రోజుల్లో హోండా ఎలివేట్ మరిన్ని గొప్ప అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








