హోండా డిస్కౌంట్స్ జాతర!.. ఈ కార్ల కొనుగోలుపై కనీవినీ ఎరుగని బెనిఫీట్స్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'హోండా' (Honda) ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో హోండా సిటీ, హోండా అమేజ్, హోండా సిటీ హైబ్రిడ్ మరియు హోండా ఎలివేట్ వంటి మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందించే ఈ బెనిఫీట్స్ పొందాలంటే ఈ కార్లను ఈ నెల చివరి లోపల కొనుగోలు చేయాల్సి ఉంది. ఆ తరువాత బహుశా ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు మరియు కార్పొరేట్ బెనిఫీట్స్ వంటివి ఉన్నాయి.

హోండా సిటీ

హోండా కంపెనీ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది.. సిటీ. ఈ కారుపై కంపెనీ ఈ నెలలో ఏకంగా రూ.1.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది సిటీ ఎలిగెంట్ ఎడిషన్ మీద లభిస్తుంది. ఏప్రిల్‌ నెలలో హోండా కంపెనీ తన సిటీ కారుకు చిన్న అప్‌డేట్ అందించింది. ఆ తరువాత ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అదనపు సేఫ్టీ కిట్‌ను పొందింది. కాబట్టి మోడల్ కొనుగోలుపైన రూ.78000 తగ్గింపు పొందవచ్చు.

Honda City

దేశీయ విఫణిలో మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మరియు స్కోడా స్లావియాల వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హోండా సిటీ కారును ఈ నెలలో కొనుగోలు చేసిన వారు మాత్రమే ఈ బెనిఫీట్స్ పొందవచ్చు. ఏప్రిల్ 1కంటే ముందు ఉత్పత్తి చేయబడిన కార్ల కొనుగోలుపైన రూ. 88000 తగ్గింపు లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

హోండా అమేజ్

అమేజ్ కొనుగోలుపైన హోండా కంపెనీ రూ. 1.06 లక్షల ప్రయోజనాలను అందిస్తోంది. ఎంట్రీ లెవెల్ ఈ వేరియంట్ మీద రూ. 66000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదే సమయంలో ఎస్ మరియు వీఎక్స్ ట్రిమ్స్ కొనుగోలుపైనా కొనుగోలుదారుడు రూ. 76000 వారికీ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి మాన్యువల్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

Honda Amaze

దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి డిజైర్ మరియు హ్యుందాయ్ ఆరా వాంతి కార్లకు హోండా అమేజ్ ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ఇటీవల నిర్వహించిన గ్లోబల్ NCAP టెస్టులో 2 స్టార్ రేటింగ్ పొందింది. అయినప్పటికీ ఈ సెడాన్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. కంపెనీ త్వరలోనే అప్డేటెడ్ అమేజ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హోండా సిటీ హైబ్రిడ్

హోండా కంపెనీ యొక్క సిటీ ఈ:హెచ్‌ఈవి కొనుగోలుపైన కస్టమర్లు రూ. 65000 వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరుని అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

Honda City e HEV

హోండా ఎలివేట్

హోండా ఎలివేట్ కొనుగోలుపైన కంపెనీ రూ.55000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హోండా ఎలివేట్ యొక్క వీ ట్రిమ్ మరియు జెడ్ఎక్స్ ట్రిమ్ కొనుగోలుపై రూ.55000 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఎంట్రీ లెవెల్ వేరియంట్ SV మరియు మిడ్ స్పెక్ వేరియంట్ VX మీద రూ.45000 తగ్గింపులు లభిస్తాయి. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Note: హోండా కంపెనీ ఎంపిక చేసిన కార్ల కొనుగోలు మీద మాత్రమే డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే ఈ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఖచ్చితమైన తగ్గింపులున గురించి తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంది. అంతే కాకుండా డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉండవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2024, 16:45 [IST]
English summary
Honda june 2024 discounts from city to elevate
Read more on: #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+