హోండా కార్లపైన గొప్ప డిస్కౌంట్స్: రూ.1.5 లక్షల బెనిఫీట్స్
గత కొంత కాలంగా దేశీయ మార్కెట్లో పలు కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ప్రయోజనాలను అందించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరోసారి హోండా ఇండియా వచ్చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హోండా ఇండియా గతంలో కొన్ని కార్ల మీద మంచి డిస్కౌంట్స్ అందించింది. ఇప్పుడు తాజాగా ఈ నెలలో (2024 మే) కూడా కొన్ని కార్ల మీద డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ జాబితాలో అమేజ్, సిటీ, సిటీ హైబ్రిడ్ మరియు హోండా ఎలివేట్ ఉన్నాయి. ఈ నెలలో ఈ కార్లను కొనుగోలు చేసేవారు భారీగా తగ్గింపులను పొందవచ్చు. బహుశా ఈ ఆఫర్స్ వచ్చే నెలలో (జులై) అందుబాటులో ఉండకపోవచ్చు.

హోండా సిటీ
హోండా కెంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ 'సిటీ' (City) కొనుగోలుపైన కస్టమర్లు రూ. 1.15 లక్షల ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో టాప్ స్పెక్ హోండా సిటీ జెడ్ఎక్స్ మీద రూ. 88000 బెనిఫిట్స్, బేస్ వేరియంట్ల మీద రూ. 78000 విలువైన ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. హోండా వీ మరియు వీఎక్స్ కొనుగోలుపైన రూ. 58000 తగ్గింపు లభిస్తుంది.
గత ఏడాది ప్రారంభించబడిన హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్ మీద కస్టమర్లు ఏకంగా రూ.1.15 లక్షల తగ్గింపును పొందవచ్చు. ఈ ఎడిషన్ ఎల్ఈడీ హై మౌంట్ స్టాప్ లాంప్ మరియు ఇతర కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. హోండా సిటీలోని 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 121 హార్స్ పవర్ మరియు 145 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

హోండా అమేజ్
హోండా అమేజ్ కొనుగోలుపైన కస్టమర్ ఈ నెలలో గరిష్టంగా రూ. 96000 ప్రయోజనాలను పొందవచ్చు. బేస్ స్పెక్ హోండా అమేజ్ ఈ వేరియంట్ కొనుగోలుపై రూ. 56000, ఎస్ మరియు వీఎక్స్ వేరియంట్ల కొనుగోలుపైన రూ. 66000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే 2023లో లాంచ్ అయిన హోండా అమేజ్ ఎలైట్ మీద రూ. 96000 తగ్గింపు లభిస్తుంది.
హోండా అమేజ్ 1.2 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 90 హార్స్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటుంది.

హోండా సిటీ హైబ్రిడ్
హోండా సిటీ మీద మాత్రమే కాకుండా హోండా సిటీ హైబ్రిడ్ మీద కూడా కంపెనీ రూ. 65000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఈ ప్రయోజనాలు వీ వేరియంట్ మీద మాత్రమే లభిస్తాయి. ఈ సెడాన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో శక్తిని పొందుతుంది. ఈ రెండూ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి కంబైన్డ్ అవుట్‌పుట్ 126 హార్స్ పవర్ వరకు ఉంటుంది.
హోండా ఎలివేట్
హోండా ఎలివేట్ కొనుగోలు మీద రూ. 55000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ హోండా ఎలివేట్ వీ వేరియంట్ కొనుగోలు మీద మాత్రమే లభిస్తుంది. టాప్ స్పెక్ జెడ్ఎక్స్ కొనుగోలుపైన రూ. 25000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఇతర వేరియంట్స్ మీద రూ. 45000 తగ్గింపు లభిస్తుంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

గమనిక: హోండా కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ లేదా బెనిఫీట్స్ కేవలం ఈ నెల చివర వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే ఈ బెనిఫీట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే డీలర్లను సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్స్ బహుశా జూన్ నెలలో అందుబాటులో ఉండకపోవచ్చు.


Click it and Unblock the Notifications








