92000లకు పైగా కార్లను వెనక్కి పిలిచిన ఆ కంపెనీ.. అందులో మీ కారు కూడా ఉందో లేదో చూసుకోండి.. కారణం ఏంటో తెలుసా?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా దేశంలోని కొన్ని కార్లను రీకాల్ చేసింది. ఎంపిక చేసిన మోడళ్లలో ఉత్పత్తి సమయంలో నెలకొన్న లోపాలను సరిదిద్దడానికి వెనక్కి పిలిచినట్లు స్పష్టం చేసింది. కంపెనీ రీకాల్ చేసిన వాటిలో మొత్తం 92,500 యూనిట్ కార్లు ఉన్నాయి. వీటిలోని కొన్ని మోడళ్లలో లోపాలు గుర్తించినట్లు కంపెనీ పేర్కొంది. వాటిని గుర్తించి రిపేర్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ రీకాల్ చేసిన మోడళ్లలో జాజ్ (Jazz), బ్రియో (Brio), బీఆర్-వీ (BR-V), డబ్య్లూఆర్-వీ (WR-V), సిటీ (City), అమేజ్ (Amaze) ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
తాజాగా ఆ కంపెనీ రీకాల్ చేయడానికి గల కారణాన్ని సైతం వెల్లడించింది. ఫ్యూయల్ పంప్‌లో సమస్య ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వీటిని తొలగించి కొత్త పంప్ రిప్లేస్ కోసం నవంబర్ ప్రారంభం నుంచి దశలవారీగా కస్టమర్ల కార్లను రిపేర్ చేయనుంది. కంపెనీ ఎటువంటి ఖర్చు లేకుండా ఈ సమస్యను పరిష్కరించనుంది. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా కస్టమర్లకు కంపెనీ సమాచారాన్ని అందించనుంది.

అయితే కంపెనీ రీకాల్ చేసిన వాటిలో ప్రస్తుతం అమ్మకానికి లేని కొన్ని మోడళ్లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలా ఏళ్ల క్రితం తయారైన కార్లలో ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అయితే దీనిపై కంపనీ ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే సమస్య చిన్నదే అయినా దీర్ఘకాలంలో అది పెద్దదిగా మారే అవకాశం ఉండటంతో వెంటనే రీకాల్ చేసింది.
కంపెనీ రీకాల్ చేసిన కార్లలో ఆగస్టు 2017 నుంచి జూన్ 2018 మధ్య తయారైన కార్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. కావున పైన పేర్కొన్న మీ కార్లు ఈ మధ్య కాలంలో తయారైనవి అయితే వెంటనే కంపెనీని అడిగి సమాచారం తెలుసుకోవచ్చు. అయితే త్వరలోనే అందరి కస్టమర్లకు నేరుగా కంపెనీ సమాచారం అందించనుంది. ఈ విషయంపై కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదు.

అంతేకాకుండా ఈ మధ్య కాలంలో అధీకృత హోండా కార్ విడిభాగాల డీలర్‌షిప్స్ ద్వారా ప్రత్యేకంగా ఫ్యూయల్ పంపును కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసిన వారు కూడా దీని గురించి సమాచారం తెలుసుకోవచ్చు. కాకపోతే మీ వాహనం వీఐఎన్ నంబర్ ఇవ్వడం ద్వారా రిటర్న్ కాల్ గురించి కూడా ఆరా తీయవచ్చు. మీ వెహికిల్‌ని రీకాల్ చేస్తారా లేదా అనే అంశంపై మీకు క్లారిటీ వస్తుంది.
మీ హోండా కార్లు ఆటోమేటిక్ స్టార్ట్ లేదా ఆఫ్ చేయడంలో ఇబ్బంది ఉంటే, మీరు మేనేజ్‌మెంట్‌కి సమాచారం ఇవ్వవచ్చు. అదే సమయంలో హోండా ఇప్పటికే కస్టమర్లను ఒక్కొక్కరుగా పిలవడం ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమస్య చిన్నదే కావడంతో కస్టమర్లు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్య పెద్దదైతే కంపెనీకే బ్యాడ్‌మార్క్ వస్తుందని కంపెనీ దీని కోసం సైతం రీకాల్ చేసింది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: మన దేశంలో అమ్మకానికి ఉన్న వాహనాలతో పాటు పాత కార్లను కూడా రీకాల్ చేయడం కొత్తేమీ కాదు. ఈ రీకాల్స్‌కి సంబంధించి కంపెనీ వ్యక్తిగతంగా అలాగే అఫీషియల్‌గా కూడా సమాచారం అందిస్తుంది. దేశంలో ఇలాంటి ఘటనలు గతంలో చాలానే జరిగాయి. ఇప్పుడు హోండా కూడా 92,000 కార్లను రీకాల్ చేసింది. త్వరలోనే అందరికీ ఈ సమస్య పరిష్కారమవుతుందని కంపెనీ తన స్టేట్‌మెంట్‌లో తెలుపడం శుభసూచికం.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








