ప్రజల కోసం ఎవరు చేయని పనిని చేస్తున్న హోండా.. ఇకపై నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు..

భారతదేశంలో ప్రముఖ వాహన తయారీ కంపెనీగా ఉన్నటువంటి హోండా తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తూ ఎక్కువ సేల్స్‌ను సాధిస్తుంది. ఈ ఏడాదిలో అధునాతన ఫీచర్లతో కార్లను విడుదల చేసి 2024లో దిగ్గజ కంపెనీలకు ప్రత్యర్థిగా నిలిచింది. హోండా ఇటీవలే కొత్త తరం అమేజ్‌ను విడుదల చేసి మార్కెట్లో వాహన పరిశ్రమలో పోటీని మరింత తీవ్రతరం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ కారు డెలివరీలు అతి త్వరలోనే మొదలు కానున్నాయి. ఇదిలా ఉంటే సాధారణంగా వాహన తయారీదారులు కొత్త తరం కారును విడుదల చేసిన వెంటనే దాని పాత కారును నిలిపి వేసి కొత్త మోడల్‌ను సేల్ చేస్తుంటారు. అయితే హోండా మాత్రం ఈ ధోరణి ఇప్పుడు ప్రక్కకు పెట్టి పాత అమేజ్‌తో పాటు కొత్త తరం కారును కూడా విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.

కొత్త తరం అమేజ్ బుకింగ్‌లను కొనసాగిస్తూనే అదే సమయంలో పాత అమేజ్‌ను కూడా విక్రయించనుందని తెలుస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఈ మోడళ్లకు మారుతీ సుజుకీ డిజైర్ ప్రత్యర్థిగా ఉంది. గతంలో కొత్తగా అప్‌డేట్ చేసిన డిజైర్‌ను విడుదల చేసిన కంపెనీ దాని పాత మోడల్‌ను నిలిపివేసింది. ఇదే విధానాన్ని అన్ని వాహన తయారీదారులు పాటిస్తున్నారు.

Honda Sell Amaze Cars Together

కానీ దీనికి ఇప్పుడు హోండా అడ్డుకట్ట వేసి కొత్త వెర్షన్‌ను విక్రయిస్తూనే పాత దాన్ని కూడా వినియోగదారుల కోసం అమ్మకానికి అందుబాటులో ఉంచాలనుకోవడం గమనార్హం. కొత్తది కావాలనుకునే వారు లేటెస్ట్ వెర్షన్‌ను లేదంటే ఓల్డ్ వెర్షన్ కావాలనుకునే వారు పాత దాన్ని కొనచ్చు. ఫీచర్ల పరంగా కొంత వరకు ఇవి వేరు వేరుగా ఉంటాయి. ప్రస్తుతం, హోండా అమేజ్ రెండవ తరం కారు ధర రూ.7.63 లక్షల నుంచి ఉంటుంది.

అదే మూడో తరం అమేజ్ రూ.8 లక్షల నుంచి లభిస్తుంది. మార్కెట్ వర్గాల పేర్కొన్న దాని ప్రకారం, ధర ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా మంది కొత్త అమేజ్‌లో టాప్ వేరియంట్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. పాత మోడల్‌ను కూడా విక్రయించడం ద్వారా కంపెనీ ఎక్కువ సేల్స్‌ను నమోదు చేసే అవకాశం ఉంది. కొత్త తరంతో పాటు పాత మోడల్‌కు డిమాండ్ ఎక్కువగానే వస్తే ఉత్పత్తిని మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది.

Honda Two Generations Amaze Cars

ఇతర వాహన తయారీ కంపెనీల అంచనాలకు భిన్నంగా కొత్తగా ఆలోచిస్తూ హోండా ముందుకు దూసుకుపోతుంది. కొత్త వెర్షన్‌కు పోటీగా పాత కారు కూడా మెరుగైన అమ్మకాలను సాధించినట్లయితే కంపెనీ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయినట్లె. దీంతో ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో పయనించే అవకాశం ఉంది. కొత్త తరం అమేజ్‌ను ఈ నెల చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేసే అవకాశం ఉంది.

కొత్త తరం అమేజ్‌ ఐదు మంది ఈజీగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌లో 18.65 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అదే సీవీటీ గేర్‌బాక్స్‌లో 19.46 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది 6 కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ప్రయాణికుల భద్రత పరంగా ఇది అత్యుత్తమైన కారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, December 14, 2024, 9:00 [IST]
English summary
Honda sell two generations of amaze cars together here details
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+