మారుతి కార్లపై మైమరపించే డిస్కౌంట్లు.. ఆఫర్‌ అంటే ఇలా ఆశ్చర్యపోయేలా ఉండాలి.. రొటీన్‌గా కాదు!

జనాలు ఒకసారి కారు కొనాలని డిసైడ్‌ అయితే ఎక్కువగా ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను మాత్రమే ఇష్టపడతారు. ఎటువంటి ప్రత్యేక ఫీచర్లు లేకపోయినా భారీ మొత్తంలో డిస్కౌంట్లు లభిస్తే కొనేందుకు ఏమాత్రం వెనుకాడారు. అందువల్ల చాలా వరకు కార్ల తయారీ సంస్థలు భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తూ ఉంటాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందంజలో ఉంది. ఇప్పటికే చాలామంది దీపావళి ఆఫర్ల కింద మారుతి కార్లను కొనుగోలు చేశారు. ఇంకా ఈ కంపెనీ కార్లపై ఆఫర్లు లభిస్తున్నాయి. అయితే కేవలం ప్రస్తుతం స్టాక్‌ ఉన్నంత వరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఇక్కడ మేము మారుతి నెక్సా ప్రీమియం మోడల్ లైనప్‌కి సంబంధించిన బెనిఫిట్స్, డిస్కౌంట్లను మోడళ్ల వారీగా వెల్లడించాము. ఒకవేళ మీకు నచ్చిన కారు ఈ కింది లిస్ట్‌లో ఉంటే కచ్చితమైన క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ డిస్కౌంట్, స్క్రాపేజ్ బోనస్ వంటి వివిధ కేటగిరీలను షోరూమ్‌లో అడిగి తెలుసుకోవచ్చు. కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ ఆఫర్లను అందిస్తున్నాం గమనించగలరు.

Suzuki Jimny Offer

జిమ్నీ: మారుతి సుజుకి తన లైఫ్ స్టైల్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీపై కూడా ఈ నెలలో భారీ ఆఫర్లను అందిస్తోంది. జిమ్నీ అన్ని వేరియంట్లపై ఏకంగా రూ .80,000 నగదు తగ్గింపును కూడా అందిస్తోంది. మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ స్కీమ్ (MSSF) కింద టాప్-స్పెక్ ఆల్ఫా వేరియంట్‌పై రూ .1.5 లక్షల బెనిఫిట్స్‌ లభిస్తాయి. అలాగే మిడ్-స్పెక్ సీట్ వేరియంట్‌పై రూ .95,000 డిస్కౌంట్‌ లభిస్తుంది.

మొత్తానికి ఈ ఎస్‌యువీపై రూ.2.3 లక్షలు వరకు తగ్గింపు పొందవచ్చు. ఇండో-జపనీస్ వాహన తయారీ సంస్థ ఈ రేంజ్‌లో జిమ్నీపై మాత్రమే ఈ డిస్కౌంట్లను అందిస్తుంది. మరే ఇతర ఎస్‌యూవీలపై కూడా ఈ ఆఫర్లు లేవు. ప్రస్తుతం జిమ్నీ ధర రూ .12.74 లక్షల నుంచి రూ .14.95 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

Grand Vitara Offer Price

గ్రాండ్ విటారా: హైబ్రిడ్ మోడల్‌పై రూ .50,000 క్యాష్‌బ్యాక్‌, రూ .65,000 స్క్రాపేజ్ బోనస్, రూ .55,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. బేస్‌ సిగ్మా వేరియంట్‌పై రూ .40,000 క్యాష్‌బ్యాక్‌, రూ .30,000 ఎక్స్ఛేంజ్, రూ .35,000 ఆప్షనల్ స్క్రాపేజ్ బోనస్ లభిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్లపై రూ .10,000 క్యాష్‌బ్యాక్‌, రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ని అందిస్తోంది.

ఇక నాన్‌ హైబ్రిడ్‌ విటారాపై రూ .67,100 నుంచి రూ .67,100 వరకు బెనిఫిట్స్‌ లభించనున్నాయి. దీని ధర రూ .6.66 లక్షల- రూ .9.84 లక్షల మధ్య (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో రూ .40,000 క్యాష్‌ తగ్గింపు, రూ .20,000 స్క్రాపేజ్ బోనస్, రూ .2,100 రూరల్‌ డిస్కౌంట్ ఉన్నాయి. సిగ్మా వేరియంట్‌లో ఈ ఆఫర్‌ ఉన్నాయి.

Ignis Offer

ఇగ్నిస్: మారుతి నెక్సా మోడల్ లైనప్‌లోని ఈ హ్యాచ్‌బ్యాక్‌పై రూ .78,100 వరకు బెనిఫిట్స్‌ ఉన్నాయి. ఇందులో రూ .45,000 క్యాష్‌బ్యాక్‌, రూ .30,000 స్క్రాపేజ్ బోనస్, రూ .3,100 రూరల్‌ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ ఇగ్నిస్‌ని రూ.5.84 లక్షల-రూ.8.06 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయవచ్చు.

సియాజ్: ఈ ప్రీమియం సెడాన్‌పై ఈ నెలలో భారీ డిస్కౌంట్‌ని అందిస్తోంది. ఈ కారుపై ఏకంగా రూ.53,000 వరకు తగ్గింపుని పొందవచ్చు. ఇందులో రూ .20,000 క్యాష్‌బ్యాక్‌, రూ .30,000 స్క్రాపేజ్ బోనస్, రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ సెడాన్ ధర రూ .9.40 లక్షల నుండి రూ .12.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

ఫ్రాంక్స్‌: ఫ్రాంక్స్ కారుపై రూ.50,000 వరకు బెనిఫిట్స్, డిస్కౌంట్లను పొందవచ్చు. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 స్క్రాపేజ్ బోనస్‌ని పొందవచ్చు. అయితే ఫ్రాంక్స్ సీఎన్‌జీ వేరియంట్లపై మారుతి ఎటువంటి క్యాష్ డిస్కౌంట్స్‌ని అందించడం లేదు. దీని ధర రూ .7.52 లక్షల నుంచి రూ .13.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 6, 2024, 19:49 [IST]
English summary
Huge discounts on maruti suzuki nexa lineups check offer price here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+