ఆ కారుపై ఏకంగా రూ. 5 లక్షల డిస్కౌంట్.. మతిపోగొతున్న భారీ ఆఫర్, వెంటనే షోరూమ్‌కి పరుగెత్తండి!
కొన్నిసార్లు కార్ల తయారీ కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు ఊహించని విధంగా ఆఫర్ల ప్రకటిస్తాయి. కారుకి డిమాండ్ తగ్గిన సందర్భంలో లేదా కొత్త మోడల్‌ని ప్రవేశపెట్టిన సమయంలో ఇటువంటి ఆఫర్లను చూడవచ్చు. ఏదైనా కారుపై దాదాపు రూ. 2 లేదా 3 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంటాయి. అయితే తాజాగా స్కోడా మాత్రం అదిరిపోయే ఆఫర్‌ని ప్రకటించింది. ఈ ఆఫర్ ధరలో కారుని 5 లక్షల తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. స్కోడా ఫ్లాగ్‌షిప్ మోడల్ కొడియాక్ ఎస్‌యూవీని ఏకంగా రూ. 5 లక్షల తగ్గింపు ధరతో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ ఆఫర్‌ని నేరుగా డీలర్‌షిప్స్ అందిస్తున్నాయి.
సాధారణంగా కార్ల ధరలు రూ. 30 లక్షలు దాటితే భారతీయలు ఆ కారుపై అంతగా ఆసక్తి కనబరచరు. కేవలం బిజినెస్‌మ్యాన్స్, ఇతర వ్యాపార సంస్థలు, సంపన్నులు మాత్రమే ఇలాంటి కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాసేపు కార్ల ధరలు విషయాలు పక్కన పెడితే ఓ కారుపై ఏకంగా రూ. 5 లక్షలు తగ్గడం అనేది చాలా అరుదు అని చెప్పవచ్చు. స్కోడా కొడియాక్ 2023 మోడల్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

కొడియాక్ టాప్ వేరియంట్‌పై మాత్రమే ఈ ఆఫర్ ఉంది. స్కోడా కొడియాక్ 2017 లో భారత్‌లో విడుదల చేశారు. దీనిని కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రీమియం కారులో 7 మంది అంటే దాదాపు రెండు ఫ్యామిలీలు హాయిగా, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఈ భారీ కారు ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.
ఈ ఎస్‌యూవీ ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్ అలాగే జీప్ మెరిడియన్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇందులో 4×4 డ్రైవ్ సిస్టమ్‌ని స్టాండర్డ్‌గా అందించారు. అందువల్ల ఇది మెరుగైన ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. ఇది MQB ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఈ స్కోడా కొడియాక్ 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (190 ps/320 nm)తో పనిచేస్తుంది. 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్)తో జతచేయబడి ఉంటుంది.

ఈ కారు లావా బ్లూ మెటాలిక్, మ్యాజిక్ బ్లాక్ మెటాలిక్, మూన్ వైట్ మెటాలిక్, గ్రాఫైట్ గ్రే మెటాలిక్ అనే ఐదు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. స్కోడా కొడియాక్ స్టైల్ వేరియంట్స్ మూన్ వైట్ మెటాలిక్ కలర్ ఆప్షన్‌ని కలిగి ఉంటాయి. ఇందులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే (స్టైల్ వేరియంట్‌లో 8 ఇంచెస్) కలవు.
వీటితో పాటు మసాజ్ ఫంక్షన్‌తో కూడిన వెంటిలేటెడ్, హీటెడ్ ఫ్రంట్ సీట్స్, అప్‌డేటెడ్ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 10-కలర్ యాంబియంట్ లైటింగ్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా 9 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్)గా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ అసిట్స్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటివి ఉన్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








