రెండు జిమ్నీ కార్లను కలిపి సరికొత్త వాహనాన్ని రూపొందించిన విద్యార్థులు.. వైరల్‌ అవుతున్న వీడియో..!

మారుతి సుజుకి జిమ్నీ కాంపాక్ట్‌ ఆఫ్‌రోడ్‌ SUV (suzuki Jimny) ప్రస్తుతం భారత్‌ సహా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జపాన్‌ రాజధాని టోక్యోలో కొందరు విద్యార్థులు రెండు జిమ్నీ కార్లను కలుపుతూ భారీ వాహనాన్ని రూపొందించారు. టోక్యోలో జరిగిన ఆటో షోలో ఈ కారును ప్రదర్శించారు.

రెండు జిమ్నీ కార్ల కలయికతో ఈ వాహనం హమ్మర్‌ లగ్జరీ కారులా కనిపిస్తోంది. నిప్పన్ ఆటోమొబైల్‌ కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ మోడల్‌ కారును రూపొందించారు. కారు డిజైన్‌ను అనుగుణంగా ఇంజిన్‌ సహా ఫీచర్లలోనూ మార్పులు చేశారు. జిమ్నీలో వినియోగించిన ఇంజిన్‌ను తొలగించి, 2.5 లీటర్‌ v6 పెట్రోల్‌ ఇంజిన్‌ను వినియోగించారు.

hummer-replica

ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 160hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు shakotan JIMNY J1 అనే పేరు పెట్టారు. ఈ వాహనం కస్టమ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. మరియు కారు వెనుకవైపు 12 స్పీకర్లు, 2 బాస్‌ స్పీకర్లను కలిగి ఉన్నాయి. ఈ సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలోని బూట్ స్పేస్‌లో అమర్చారు.

అయితే ఈ కారులో ఎంత మంది ప్రయాణం చేయవచ్చు అనేది వెల్లడి కాలేదు. అయితే 8 మంది కంటే ఎక్కువ మంది ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు ఈ వాహనం రూఫ్‌పైన సైకిళ్లను తీసుకెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతోపాటు కారు ఫ్రంట్‌లో రగ్‌గా కనిపించేందుకు ప్రత్యేక ప్యానల్‌ను ఉపయోగించారు.

Two suzuki jimny merged as hummer vehicle

భారత్‌ మార్కెట్‌లో మారుతి జిమ్నీ 5 డోర్‌ ఎస్‌యూవీ ధర రూ.12.74 లక్షల నుంచి రూ.15.05 లక్షలు (ఎక్స్‌షోరూం) ధరకు అందుబాటులో ఉంది. ఈ ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీ 1.5 లీటర్‌ K- సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 6000 rpm వద్ద 103bhp శక్తిని, 4000rpm వద్ద 134.2 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జిమ్నీ SUV మాన్యువల్‌ వేరియంట్‌ 16.94 km/l మైలేజీ ఇస్తుంది. అదే ఆటోమేటిక్‌ వేరియంట్ 16.39 km/l మైలేజ్‌ ఇస్తుంది. 40 లీటర్ల ఇంధన ట్యాంక్‌ కలిగి ఉన్న మారుతి సుజుకి జిమ్నీ 650 కి.మీ మేర మైలేజీ ఇస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్‌ మాన్యువల్‌, 4- స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

hummer replica bulid by jimny off roads suvs merged

మారుతి జిమ్ని ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంది. ఫ్లాట్‌ క్లామ్‌షెల్ బానెట్‌, LED ప్రాజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌, అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ కారు 4 వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీపై పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీ 2590mm వీల్‌ బేస్‌తో వస్తుంది.

ఈ వాహనం కీలక ఫీచర్లను కలిగి ఉంది. 9 అంగుళాల స్మార్ట్‌ ప్లే ప్రో ప్లస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, కీలెస్‌ ఎంట్రీ వంటి అనేక అధునాత ఫీచర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.

Two suzuki jimny off road suvs merged

భద్రతా పరంగాను అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS- యాంటీలాక్‌ బ్రేకింగ్ సిస్టమ్‌, END- ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, హిల్‌ హోల్డ్ కంట్రోల్‌, హిల్‌ డిసెంట్‌ కంట్రోల్‌, సైడ్‌ ఇంపాక్ట్‌ డోర్ బీమ్‌లతో సహా డజర్ల కొద్దీ భద్రతా ఫీచర్లను మారుతి 5-డోర్‌ ఆఫ్‌రోడ్‌ ఎస్‌యూవీ జిమ్నీ కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 18, 2024, 12:24 [IST]
English summary
Hummer replica bulid by jimny off roads suvs merged video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+