ఇంకా టాప్‌లోనే కొనసాగుతున్న ఆ కారు సేల్స్‌.. SUV విభాగంలో రారాజు!

భారత్‌లో హ్యుందాయ్‌ కార్ల అమ్మకాల్లో జోర్లు అందుకుంటుంది. ముఖ్యంగా ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు దుమ్మురేపుతుంది. ఆ కంపెనీ నుంచి ప్రస్తుతం ఫుల్‌ డిమాండ్‌లో ఉన్న కార్లలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. హ్యుందాయ్ ఈ ఏడాది ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్ క్రెటా ఎస్‌యూవీని విడుదల చేసింది. ఆ వెంటనే హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ స్పోర్టియర్ మోడల్ అయిన క్రెటా ఎన్ లైన్‌ని విడుదల చేసింది. హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఈ కారు విడదల నుంచి భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తూనే ఉంది. అందుకు తగినట్లుగా హ్యుందాయ్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తన సూపర్ హిట్ క్రెటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తోంది.

తాజాగా రికార్డ్ బుకింగ్స్‌తో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జూలైలో క్రెటా ఎస్‌యూవీ స్పోర్టియర్ ఎన్-లైన్ మోడల్‌ని విడుదల చేసింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024కి సంబంధించి తన అమ్మకాల గణాంకాలను వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కాలంలో కొరియన్ బ్రాండ్ 5.68 శాతం వృద్ధిని సాధించింది.

Hyundai-Creta-Sales-Crossed-90000-Units-Sales-In-2024

2024 ప్రథమార్ధంలో 91,348 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం ద్వారా హ్యుందాయ్ ఈ ఘనతను సాధించింది. 2023 జనవరి-జూన్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది క్రెటా అమ్మకాలు 11 శాతం పెరిగాయి. హ్యుందాయ్ దేశీయ అమ్మకాల్లో క్రెటా వాటా 30 శాతంగా ఉంది. ఇక క్రెటా ఎస్‌యూవీ రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌తో వస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఇండియన్ మార్కెట్‌లో అధికంగా అమ్ముడవుతోంది.

ఈ హ్యుందాయ్ క్రెటా E, EX, S, S (O), SX, SX Tech మరియు SX(O) అనే ఏడు వేరియంట్లలో లభిస్తుంది. ఒక్కో వేరియంట్ ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వేరియంట్‌కి తగిటన్లుగా ధరలను సంస్థ నిర్ణయించింది. వాటిలోని ఫీచర్లు, ఇతర ఆఫర్ల ఆధారంగా ధరలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‌యూవీ సేల్స్‌లో హ్యుందాయ్‌ క్రెటాలోని చాలా వరకు వేరియంట్స్‌ అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయి.

Hyundai-Creta-Sales-In-2024

క్రెటా ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీలో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు, సవరించిన క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో కూడిన డ్యూయల్ జోన్ ఏసీ, 360 డిగ్రీల కెమెరా, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) ఉన్నాయి. ఇందులో పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8 స్పీకర్ బాస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి.

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే హ్యుందాయ్ క్రెటాలో ఆరు ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ఉన్నాయి. వెనుక సీటు 2 - స్టెప్ రెక్లైన్ ఫంక్షన్ మరియు ఖరీదైన ప్యాకేజీతో పాటు, కొత్త హ్యుందాయ్ క్రెటాలోని ఇంటీరియర్ సౌకర్యం మరియు ప్రయాణికుల సౌలభ్యం కోసం క్యాబిన్‌లో ఎక్కువ స్పేస్‌ ఇవ్వబడింది.

Hyundai-Creta-Sales-Crossed-90000-Units-Sales-In-2024

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌ ఉన్నాయి. ఇది 6-స్పీడ్‌ MT, సీవీటీ 7-స్పీడ్ DCT మరియు 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్‌తో లభిస్తుంది. ఇది 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ 115 PS శక్తిని, 144 NM గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

1.5-లీటర్ పవర్ ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 PS శక్తిని, 253 NM గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు రోజువారీ ప్రయాణం మరియు సుదీర్ఘ ప్రయాణాలు రెండింటికీ అనువైనది. ఈ పాపులర్ క్రెటా ఎస్‌యూవీ లీటర్‌కి 17.4 కిలోమీటర్ల నుంచి 21.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మంచి మైలేజీ అందించే ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది.

More from DriveSpark

Article Published On: Sunday, July 7, 2024, 11:15 [IST]
English summary
Huyndai creta crossed 90000 plus unit sales in 2024 details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+