భారత్‌లో బోణీ కొట్టిన లోటస్.. Eletre ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన హైదరాబాద్ యువతి, ధర ఎంతో తెలుసా.!
కార్ల తయారీదారు లోటస్(Lotus) భారతదేశంలో ఇటీవల తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సంస్థ మొదటి ఎలక్చ్రిక్ కారును హైదరాబాద్ చెందిన మహిళ కొనుగోలు చేసింది. అయితే ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.?? భారత్‌లో లోటస్ తన వ్యాపారాన్ని ప్రారంభించిన రెండు నెలల తర్వాత తన మొదటి కారును విక్రయించింది.
కార్ల తయారీ సంస్థ లోటస్ అనేది చైనాకు చెందిన కీలీకి అనుబంధంగా ఉన్న కార్ల తయారీ సంస్థ. 2023 నవంబర్‌లో భారతదేశంలోకి తొలిసారిగా లోటస్ సంస్థ కార్లను విడుదల చేయడానికి ప్రణాళిక వేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ SUV, ఎలట్రే(Eletre) ను విడుదల చేసింది.

అయితే ఈ కారు భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క కారును కూడా విక్రయించలేదు. అందుకు కారణం ఈ కారు(Lotus Eletre Electric SUV) ధర రూ. 2.55 కోట్లు కావడమే.. ఇంత ధర వెచ్చించి ఇలాంటి కారును కొనుగోలు చేయడం భారత్‌లో చాలా తక్కువ. కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఇంత కాస్ట్లీ కారును కొనుగోలు చేయగలరు.
అందుకే లోటస్ తన మొదటి కారును విక్రయించడానికి ఇంత సమయం పట్టింది. ఈ నెలలోనే, కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారును విజయవంతంగా చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ లోటస్‌కి చెందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Eletre ను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు కార్ క్రేజీ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ కారు ప్రధాన రంగు పసుపు అయినప్పటికీ.. Eletre కారు ఓనర్ రెడ్ కార్ కావాలని కోరడంతో ఆ కలర్ కారును సంస్థ విక్రయించింది. అయితే రూ. 2.55 కోట్ల ఖరీదు చేసే ఈ కారు ప్రత్యేకతలు ఏంటని మీకు అనిపించవచ్చు. లోటస్‌ను చైనీస్ కంపెనీ నడుపుతున్నప్పటికీ, ఇది ఇప్పటికీ బ్రిటిష్ కార్ల తయారీదారు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును మూడు వేరియంట్లలో విడుదల చేసింది.
ఎలక్ట్రిక్, ఎలక్ట్రిక్ ఎస్, ఎలక్ట్రిక్ ఆర్ వేరియంట్లలో Eletre కారును లోటస్ విడుదల చేసింది. డిజైన్ విషయానికొస్తే ఎక్స్‌టీరియర్ పరంగా ముందు వైపు ఫెరారీ కారును పోలి ఉంటుంది. హెడ్‌లైట్ సెటప్‌లతో వస్తున్నా.. ఇందులో పెద్ద సైజు బోనెట్లను చూడవచ్చు. లోటస్ కంపెనీ లోగో ముందు భాగంలో అందించారు. ఇంకా ఏరో ఆకారంలో DRLలు కూడా ఉన్నాయి. LED హెడ్‌లైట్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Eletre సైడ్ పార్ట్ విషయానికి వస్తే, భారీ క్లాడింగ్‌తో వస్తుంది. 22 అంగుళాల 10-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, విలాసవంతంగా అనేక ఫీచర్లతో నిండి ఉంది. ఇంజిన్ విషయానికొస్తే ఇందులో 112 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఇది డ్యూయల్ మోటార్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 600 బిహెచ్‌పి పవర్ మరియు 710 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Eletre కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అంతే కాకుండా ఈ కారు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ SUV. ఈ కారు గరిష్ఠంగా 258 కి.మీ.ల వేగాన్ని అందుకుంటుంది. అన్ని ట్యాక్స్‌లతో కలిపి భారత్‌లో ఈ కారు ధర రూ. 2.55 కోట్లు.
భారతదేశంలో చాలా తక్కువ సంఖ్యలో ప్రీమియం కార్ కొనుగోలుదారులు ఉన్నప్పటికీ, లోటస్ వారిని లక్ష్యంగా చేసుకుని, ముందుగా తన బ్రాండ్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి శ్రమిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, విలాసవంతమైన ఫీచర్లతో పాటు హై పర్ఫామెన్స్‌తో కూడిన కార్లను తయారు చేస్తూ భారత మార్కెట్లో పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లోటస్ భారత్‌లో తన తొలి కారును విజయవంతంగా విక్రయించింది.


Click it and Unblock the Notifications








