హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఇప్పుడు ఎవ్వరైనా కారు కొనొచ్చు

పండుగ సీజన్ వచ్చేస్తోంది.. కొత్త కారు కొనాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. పండుగ సీజన్ వచ్చినప్పుడే ఎందుకు కారు కొనాలనుకుంటారు అంటే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయని. అనుకున్న విధంగానే చాలా కంపెనీలు ఆగష్టు 2024లో మంచి బెనిఫీట్స్ అందించడం ప్రారంభించాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ కూడా ఉంది. ఈ కంపెనీ క్రెటా, క్రెటా ఎన్ లైన్, ఐ20 ఎన్ లైన్, అల్కాజర్, టక్సన్ మరియు హ్యుందాయ్ వెర్నా మొదలైన మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందించే ప్రయోజనాలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం.

హ్యుందాయ్ అల్కాజార్

ఈ నెలలో హ్యుందాయ్ కంపెనీ యొక్క అల్కాజర్ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 90000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బెనిఫిట్స్ డీజిల్ మరియు పెట్రోల్ కార్లకు వర్తిస్తుంది. 6 సీటర్ మరియు 7 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండే ఈ మోడల్ 160 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 116 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది.

Hyundai

హ్యుందాయ్ టక్సన్

హ్యుందాయ్ టక్సన్ పెట్రోల్ వేరియంట్ కొనుగోలుపై రూ. 25000, డీజిల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 50000 డిస్కౌంట్స్ లభిస్తుంది. జీప్ కంపాస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఈ కారు 156 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 186 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది.

హ్యుందాయ్ వెన్యూ అండ్ వెన్యూ ఎన్ లైన్

వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ రెండు మోడల్స్ మీద హ్యుందాయ్ ప్రయోజనాలను అందిస్తోంది. వెన్యూ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ మీద రూ.60000 ప్రయోజనాలను, రూ. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ వేరియంట్ మీద రూ.55000 తగ్గింపు లభిస్తుంది. ఇక 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్‌పై రూ.50000 ప్రయోజనాలు లభిస్తాయి. వెన్యూ ఎన్ లైన్ కొనుగోలుపై రూ.55000 తగ్గింపు పొందవచ్చు.

Hyundai Verna

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా కొనుగోలుపైన కంపెనీ ప్రస్తుతం రూ. 15000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 5000 స్క్రాపేజ్ బోనస్ అందిస్తుంది. ఇలా మొత్తం మీద కంపెనీ ఈ కారు కొనుగోలుపైన రూ. 40000 తగ్గింపు అందిస్తుంది. దేశీయ మార్కెట్లో హోండా సిటీ, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఈ కారు అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

హ్యుందాయ్ ఐ20

ఈ నెలలో హ్యుందాయ్ ఐ20 కొనుగోలు చేసే కస్టమర్లు రూ.50000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. సీవీటీ వేరియంట్స్ మీద రూ. 35000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. హ్యుందాయ్ ఐ20 ధర రూ. 7.04 లక్షల నుంచి రూ. 11.21 లక్షల మధ్యలో ఉంది. ఈ కారు మార్కెట్లో మారుతి సుజుకి బాలెనొ, టయోటా గ్లాంజా మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Hyundai i20

పైన చెప్పిన కార్ల కొనుగోలు మీద మాత్రమే కాకుండా.. హ్యుందాయ్ తన గ్రాండ్ ఐ10 నియోస్ మీద రూ. 53000 ప్రయోజనాలను, ఆరా కొనుగోలు మీద రూ. 48000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. వీటితో పాటు హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనుగోలు మీద కూడా ఈ నెలలో రూ. 20000 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్) వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక: హ్యుందాయ్ కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలు (బెనిఫిట్స్) ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ యొక్క అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2024, 12:20 [IST]
English summary
Hyundai 2024 august discounts from alcazar to exter
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+