వారెవ్వా.. డిస్కౌంట్స్ అంటే ఇలా ఉండాలి!.. కొత్త కారు కొనాలనుకునే వారికి పండగే!

హ్యుందాయ్ (Hyundai) కంపెనీ ఈ నెలలో (2024 జూన్) తన హ్యుందాయ్ క్రెటా, అల్కాజార్, వెర్నా, ఎక్స్‌టర్, ఆరా, ఐ20, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, ఐ10 నియోస్ మరియు టక్సన్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, కార్పొరేట్ బోనస్ మరియు ఎక్స్చేంజ్ వంటివి ఉన్నాయి. ఈ ఆఫర్స్ అన్నీ జూన్ 30 లోపల ఎంపిక చేసిన మోడల్స్ కొనుగోలు చేసేవారికి మాత్రమే లభిస్తాయి. ఈ కథనంలో హ్యుందాయ్ కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar)

దేశీయ మార్కెట్లో టాటా సఫారీ మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హ్యుందాయ్ కంపెనీ యొక్క అల్కాజార్ కొనుగోలుపైన కస్టమర్లు గరిష్టంగా రూ. 70000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మార్కెట్లో డీజిల్ మరియు పెట్రోల్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

Hyundai Alcazar

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ CNG వేరియంట్ కొనుగోలు మీద గరిష్టంగా రూ. 53000 తగ్గింపు లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మీద రూ. 43000 డిస్కౌంట్ మరియు పెట్రోల్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ మీద రూ. 33000 తగ్గింపు లభిస్తుంది. గ్రాండ్ ఐ10 నియోస్ 1.2 లీటర్ పెట్రోల్ మరియు CNG ఆప్షన్లలో లభిస్తుంది. ఈ రెండూ ఉత్తమ పనితీరుని అందిస్తాయి.

హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson)

హ్యుందాయ్ టక్సన్ డీజిల్ వేరియంట్ మీద రూ. 50000.. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25000 తగ్గింపు ఈ నెలలో కొనుగోలు చేసేవారిలో లభిస్తాయి. టక్సన్ 156 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 186 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ పొందుతాయి. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

Hyundai Tucson

హ్యుందాయ్ వెన్యూ మరియు వెన్యూ ఎన్ లైన్ (Hyundai Venue & Venue N Line)

కస్టమర్లు ఈ నెలలో హ్యుందాయ్ వెన్యూ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలు మీద రూ.50000 మరియు డ్యూయెల్ క్లచ్ వేరియంట్‌ కొనుగోలు మీద రూ.45000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. అదే సమయంలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మీద రూ.40000 వరకు తగ్గింపులు లభిస్తాయి. డీజిల్ వేరియంట్స్ మీద ఎలాంటి తగ్గింపులు అందుబాటులో లేదు. హ్యుందాయ్ ఎన్ లైన్ మీద రూ. 45000 తగ్గింపు లభిస్తుంది.

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)

హ్యుందాయ్ ఐ20 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కొనుగోలుపై రూ. 50000, CVT వేరియంట్ మీద రూ. 35000 తగ్గింపు పొందవచ్చు.మారుతి సుజుకి బాలెనొ, టాటా ఆల్ట్రోజ్ మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే హ్యుందాయ్ ఐ20 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

Hyundai i20

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)

ఆరా కాంపాక్ట్ సెడాన్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 48000 ప్రయోజనాలు పొందవచ్చు. ఈ తగ్గింపు (రూ. 48000) CNG కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 28000 తగ్గింపు లభిస్తుంది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ తగ్గింపులు లభిస్తాయి.

హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna)

హ్యుందాయ్ వెర్నా కొనుగోలుపైన రూ.40000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సెడాన్ రెండు పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ 115 హార్స్ పవర్ మరియు 143 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అదే విధంగా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)

హ్యుందాయ్ కంపెనీ తన ఎక్స్‌టర్ కొనుగోలు మీద కేవలం రూ. 10000 విలువైన ప్రయోజనాలను మాత్రమే అందిస్తుంది. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దేశీయ విఫణిలో టాటా పంచ్ మరియు సిట్రోయెన్ సీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Note: దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీ ఎంపిక చేసిన తన కార్ల మీద ఈ నెల చివరి వరకు మాత్రమే తగ్గింపులను అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్స్ డీలర్ వద్ద ఉన్న స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2024, 18:06 [IST]
English summary
Hyundai 2024 june month discounts from alcazar to exter
Read more on: #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+