Hyundai Alcazar Facelift Review Video కొత్త హ్యుందాయ్‌ అల్కజార్‌లో కొత్తగా ఏముందా? ఎలా పనిచేస్తుంది?

కొత్తగా విడుదలైన 2024 హ్యుందాయ్ అల్కజార్ భారీ మార్పులతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఈ కారులోని ఫీచర్లు మిడ్‌ సైజ్‌ SUV విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పనున్నాయి. దీనిలోని భారీ డిజైన్, విశాలమైన ఇంటీరియర్ స్పేస్, అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది తక్కువ దూరం ప్రయాణాలతో పాటు సుదూర ప్రాంతాలకు ప్రయాణించేలా అనువుగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఫర్ఫామెన్స్‌ ఇతర అప్‌గ్రేడ్స్‌తో సరికొత్తగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

ఈ సరికొత్త కారుని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ముఖ్యంగా దీని అద్భుతమైన కొత్త ఫ్రంట్ లుక్ హెడ్‌లైట్స్‌, డే టైమ్ రన్నింగ్ లైట్స్‌తో సరికొత్త రూపాన్ని కలిగి ఉంటుంది. అయితే కొత్త బాడీ కలర్స్, అప్‌డేట్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌తో పాటు, క్యాబిన్‌లో లగ్జరీ అనుభూతిని ఇచ్చే విశాలమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని సన్‌రూఫ్‌, రీ డిజైన్‌ చేసిన డ్యాష్‌బోర్డ్, అప్హోల్స్టరీ ఇతర టెక్నికల్‌ ఫీచర్లతో వస్తుంది.

ఈ కారు 6 లేదా 7-సీట్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 6-సీటర్ మోడల్‌లో అదనపు సౌకర్యం కోసం మధ్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉంటాయి, 7-సీటర్‌లో బెంచ్ సీటును అందిస్తుంది. ఇందులోని ప్రయాణీకులందరూ సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. మిడిల్ లైన్‌లోనూ వెంటిలేటెడ్ సీట్లు, రెండు వైర్‌లెస్ ఛార్జర్స్‌ మూడవ-వరుసలో ఉన్నవారి కోసం ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ కంట్రోలింగ్స్ కలిగి ఉన్నాయి.

ఈ 2024 హ్యుందాయ్ అల్కజార్ రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తుంది. 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 PS పవర్ మరియు 253 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)తో లభిస్తుంది. ఇక 1.5L టర్బో డీజిల్ ఇంజిన్ 116 PS పవర్, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

Hyundai Alcazar Facelift Review Video

More from DriveSpark

Article Published On: Wednesday, September 18, 2024, 16:34 [IST]
English summary
Hyundai alcazar facelift review video driving impressions and specifications
Read more on: #hyundai #car review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+