ఈ కొత్త కారులో రెండు ఫ్యామిలీలు హాయిగా వెళ్లొచ్చు.. మైలేజీ, ఫీచర్లు, డిజైన్ ఇతర టాప్-5 విషయాలు చూసేయండి!
హ్యుందాయ్ మోటార్స్ అప్‌డేటెడ్ అల్కాజార్‌ని (Hyundai Alcazar) భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా హ్యుందాయ్ విడుదల చేసిన ఈ ఎస్‌యూవీలో భారీ డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లను అందించారు. ఈ సరికొత్త మోడల్ పెట్రోల్ వెర్షన్ ధర రూ .14.99 లక్షలుగా, డీజిల్ వేరియంట్ రూ .15.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ హ్యుందాయ్ అల్కాజర్ 6, 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో లభిస్తుంది. ఇక దీనికి సంబంధించిన పలు వేరియంట్లు, ధరల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
2024 హ్యుందాయ్ ఆల్కాజార్ ఎక్స్‌టీరియర్: తాజాగా విడుదలైన అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో H-ఆకారంలో LED DRLs, కనెక్ట్ చేయబడిన లైట్ బార్స్, పెద్ద గ్రిల్స్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో వెన్యూలో మాదిరిగా ఫుల్-వెడల్పాటి టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్స్‌పై సిల్వర్ యాక్సెంట్స్ స్పోర్టీ టచ్‌ని కలిగి ఉంటాయి. సైడ్ ఫ్రొఫైల్‌లో కొత్తగా డిజైన్ చేసిన 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్: దీని ఇంటీరియర్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మాదిరి డ్యాష్ బోర్డ్ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది. ముందు భాగంలోని సీట్ల మధ్య ఫిక్స్డ్ సెంటర్ కన్సోల్‌ని తొలగించడం ద్వారా ఎక్కువ స్థలాన్ని గమనించవచ్చు. ఇక రెండవ వరుస నుంచి మూడవ వరుస లోకి సులభంగా ప్రవేశించేలా ఇబ్బంది లేకుండా అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. డ్యూయల్ టోన్ (టాన్ & బ్లాక్) థీమ్ ఇంటీరియర్‌తో ఇది వస్తుంది.
అల్కాజార్ ఫీచర్లు: ఇందులో డ్యూయల్ 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్స్ ఉన్నాయి. అలాగే మెరుగైన సేఫ్టీ ఏడీఎస్, కూల్డ్ రియర్ సీట్లు ఉన్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వాయిస్-కంట్రోల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆపరేట్ వంటి ఫీచర్లను ఈ ఎస్‌యూవీ కలిగి ఉంది. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్స్: అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ దాని మునుపటి మోడల్స్‌లో అందించిన ఇంజిన్ ఆప్షన్స్‌తోనే వస్తుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఇది 160 bhp, 253 nm విడుదల చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 116 bhp, 250 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ లేదా ఆప్షనల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో వస్తుంది.
మైలేజీ: ఈ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ ఎక్కువ మైలేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. టర్బో-పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 17.5 కిలోమీటర్లు, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక డీజల్ ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో 20.1 కిలోమీటర్లు, ఆటోమేటిక్ గేర్ బాక్స్ 18.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: హ్యుందాయ్ రిఫ్రెష్డ్ అల్కాజర్ దాని ఫర్పామెన్స్‌ని నిలుపుకోనుంది. దీని భారీ ఫీచర్లు స్టైలిష్డ్ డిజైన్ మార్కెట్‌లోని ఇతర ఫ్యామిలీ కార్లకు టఫ్ ఫైట్‌ని ఇవ్వనుంది. మంచి ఫ్యామిలీ కారు కోసం చూస్తున్న వారికి ఇది ఫర్‌ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మైలేజీ పరంగా, ఫీచర్లు, కంఫర్ట్ తదితర అంశాల్లో పెద్ద ఫ్యామిలీలకు ఇది సరిపోనుంది.


Click it and Unblock the Notifications








