భారత్‌లో 75000 కంటే ఎక్కువమంది ఇష్టపడి కొన్న కారు ఇదే!.. దీని గురించి తెలుసా?
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎప్పటికప్పుడు మార్కెట్లో ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అంతే కాకుండా దాని ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇస్తుంది. కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసిన 'హ్యుందాయ్ ఆల్కజార్' (Hyundai Alcazar) ఒక్క మన దేశంలోనే ఏకంగా 75506 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. ఎగుమతులను కలుపుకుంటే ఈ సంఖ్య ఒక లక్ష కంటే ఎక్కువే అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. హ్యుందాయ్ కంపెనీ ఆల్కజార్ SUVను దేశీయ విఫణిలో 2021 జూన్ 18న లాంచ్ చేసినప్పటి నుంచి అత్యధిక అమ్మకాలను పొందిన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. మార్కెట్లో ఈ కారును కంపెనీ లాంచ్ చేసినప్పటి నుంచి ఏకంగా 103682 యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. ఇందులో దేశీయ అమ్మకాలు 75506 యూనిట్లు కాగా.. ఎగుమతులు 27176 యూనిట్లు.

హ్యుందాయ్ కంపెనీ.. మొత్తం 36 నెలల్లో చెన్నై శ్రీపెరంబుదూర్‌లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా తయారీ కర్మాగారం 103243 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇందులో మొత్తం 103652 యూనిట్లను విజయవంతంగా విక్రయించింది. ఈ అమ్మకాలు కేవలం ఇండియా మాత్రమే కాకూండా ఇతర దేశాల్లో కూడా జరిగాయి. రాబోయే రోజుల్లో ఈ సంక్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.
హ్యుందాయ్ కంపెనీ FY2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 38394 యూనిట్ల ఆల్కజార్ కార్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 26696 యూనిట్లు భారతదేశంలో, మిగిలిన యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఆ తరువాత 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ 31873 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇందులో 20753 యూనిట్లు దేశీయ అమ్మకాలు కాగా.. 10825 యూనిట్లు ఎగుమతులని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ యొక్క ఆల్కజార్ అమ్మకాలు కొంత తగ్గాయి. ఏప్రిల్ - మే 2024లో మొత్తం అమ్మకాలు 2163 ఊనిట్లు మాత్రమే. 2023 ఏప్రిల్ - మే సమయంలో కంపెనీ 4480 యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. మొత్తం మీద దేశీయ మరియు విదేశీ ఎగుమతులు రెండూ కూడా గణనీయంగా తగ్గినట్లు.. ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా కంపెనీ తన ఆల్కజార్ అమ్మకలకు పూర్వ వైభవం తీసుకురావడానికి దీన్ని ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఈ కారు 2024 సెప్టెంబర్ లేదా అక్టోబర్ సమయంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కారును ఆల్కజార్ మూడో వార్షికోత్సవం సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఇది పండుగ సీజన్‌కు ముందే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

2024 జనవరిలో హ్యుందాయ్ కొత్త క్రెటాను లాంచ్ చేసింది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెళ్తోంది. దీనిని దృష్టిలో ఉందుకుని కంపెనీ తన ఆల్కజార్ కారును కూడా ఆధునిక హంగులతో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత టాటా సఫారీ, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








