ఆ కారు మరింత అందంగా ముస్తాబై వచ్చింది... సేల్స్ పెంచింది.. ప్రీమియం ఫీచర్లు, 20 కి.మీ మైలేజీ పక్కా!

హ్యుందాయ్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు దుమ్మురేపుతున్నాయి. ఎస్‌యూవీ విభాగంలో ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) టాప్‌లో కొనసాగుతుండగా.. మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ (Hyundai Exter) సైతం ‌అదరగొడుతోంది. అలాగే హ్యుందాయ్ అల్కజార్‌కి మార్కెట్‌లో మంచి ఫేమ్‌ ఉంది. 2024 అల్కజార్‌ ఫేస్‌లిఫ్ట్ (2024 Hyundai Alcazar Facelift) ఎస్‌యూవీని గత నెలలో భారతీయ మార్కెట్‌లో ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ 6, 7-సీట్ల కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

సెప్టెంబర్‌లో అల్కజార్‌ ఎస్‌యూవీకి సంబంధించిన సేల్స్‌ రిపోర్ట్‌ వెల్లడైంది. హ్యుందాయ్ అల్కజార్ గత నెలలో మొత్తం 2,712 యూనిట్లను హ్యుందాయ్‌ విక్రయించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే కంపెనీ 1,977 యూనిట్లను మాత్రమే సేల్‌ చేసింది. ఈ లెక్కన గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ కారు సేల్స్‌ 37 శాతం పెరిగింది. ఇది కంపెనీ ఓవరాల్‌ సేల్స్‌కి కలిసి వచ్చింది.

Hyundai Alcazar September 2024 Sales Report

ఇది వరకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పాత మోడల్‌తో పోలిస్తే కొత్త హ్యుందాయ్ అల్కజార్‌ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది రిఫ్రెషింగ్ డిజైన్, సరికొత్త ఫీచర్లతో రావడంతో కస్టమర్లు దీనిని కూడా వారి విష్‌లిస్ట్‌లో చేర్చుకుంటున్నారు. ఈ కొత్త అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ .14.99 లక్షలు (ఎక్స్‌-షోరమ్‌), డీజిల్ వేరియంట్ ధరలు రూ .15.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతాయి.

ఈ కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ 2 పవర్‌ట్రైన్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ GDT టర్బో పెట్రోల్ ఇంజిన్ 158 bhp పవర్ వద్ద, 253 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే మరో 1.5-లీటర్ డీజల్ ఇంజిన్ 113 bhp పవర్ వద్ద 250 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయును.

Hyundai Alcazar

ఈ ఎస్‌యూవీలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌ జతచేయబడి ఉంటుంది. అలాగే నార్మల్, ఎకో, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది స్నో, మడ్, శాండ్ అనే 3 ట్రాక్షన్ మోడ్స్‌తోనూ వస్తుంది. అలాగే వీటిలో స్టార్ట్ / స్టాప్ సిస్టమ్స్ ఉన్నాయి.

ఇక ఇందులోని పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌ మోడల్ లీటరుకు 18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే ఇందులోని డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ మోడల్‌ 20.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్ లీటరుకు 18.1 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

Hyundai Alcazar September 2024 Sales Report

అప్‌డేటెడ్ హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్‌లో ఢిపరెంట్‌ గ్రిల్, హెడ్ ల్యాంప్స్, H-ఆకారంలో ఉన్న LED DRLs, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, LED టెయిల్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్ క్యాబిన్‌ కూడా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ అప్‌డేట్స్ వల్ల జనాలు ఈ ఎస్‌యూవీని ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అండ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, లెవల్-2 ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 6 ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ పెర్ల్, రేంజర్ ఖాకీ, ఫియరీ రెడ్, స్టార్రీ నైట్, టైటాన్ గ్రే మ్యాట్ వంటి మొత్తం 9 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, October 18, 2024, 7:20 [IST]
English summary
Hyundai alcazar september 2024 sales report check price and features in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+