ఫుల్ ట్యాంక్‌తో 940 కి.మీ.. రెండు కుటుంబాలకు ఈజీగా సరిపోద్ది.. భారీ డిమాండ్ ఉన్న కారు..

దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా వరుసగా తన కార్ల అమ్మకాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మోడళ్ల డేటాను విడుదల చేయగా, ఇప్పుడు అల్కజార్(alcazar) ఫేస్‌లిఫ్ట్ SUV విక్రయాల నివేదికను వెల్లడించింది. ఇది పెద్ద కారు. రెండు కుటుంబాలు కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. 6,7 సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీ లోపల విశాలంగా ఉంటుంది. కరోనా తరువాత కుటుంబం, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్లకు, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుండటం కారణంగా ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ విభాగంపై కార్ల తయారీ కంపెనీలు దృష్టి వీటి అధికంగా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. హ్యుందాయ్ నుంచి వచ్చిన అల్కజార్‌కు కూడా ఇదే విభాగానికి చెందింది.

హ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన తాజా డేటా ప్రకారం, అల్కజార్ కారుకు డిమాండ్ పెరుగుతుంది. కస్టమర్లు ఇటీవల కాలంలో దీన్ని ఎక్కువగా కొనుగోలు చేశారు. 2024 నవంబర్ నెలలో ఇది మొత్తం 2,134 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అదే గత ఏడాది (2023) ఇదే నెలలో ఈ ఎస్‌యూవీని 1,913 మంది కొనుగోలు చేశారు. ఏడాది ప్రాతిపదికన విక్రయాల వృద్ధిని చూసినట్లయితే ఇది 53 శాతం పెరిగింది.

Hyundai Alcazar Suv Sales

అల్కాజార్ SUVని కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్‌‌తో తయారు చేసింది. ఇది 2 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ జీడీటీ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ 158 bhp పవర్‌ను, 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే డీజిల్ వేరియంట్ 113 bhp పవర్, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజిన్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను జత చేశారు. ఇది డజన్ల కొద్ది ఫీచర్లను కలిగి ఉంది. క్యాబిన్ డ్యాష్‌బోర్డు‌లో స్మార్ట్ టచ్ ఆప్షన్లు చాలా ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 8-స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, రెండో వరుస సీట్లు ప్రత్యేకంగా వెంటిలేటెడ్‌గా ఉంటాయి.

Hyundai Alcazar Suv Sales Details

ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో అదనంగా రక్షణ అందించడానికి 40 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు. అల్కజార్ ప్రెస్టీజ్, ఎగ్జిక్యూటివ్, సిగ్నేచర్, ప్లాటినం అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇది ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారీ వంటి కార్లకు పోటీ ఇస్తుంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా అద్బుతంగా ఉంటుంది. 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కారుకు ప్రత్యేక రూపాన్ని తీసుకొచ్చాయి. అల్కజార్‌ పెట్రోల్ వేరియంట్ ధర రూ.14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్ నుంచి ఉంటుంది. అదే డీజిల్ రూ.15.99 లక్షల (ఎక్స్-షోరూమ్)కు లభిస్తుంది. ఇది ఫియరీ రెడ్, అట్లాస్ వైట్, రోబస్ట్ ఎమరాల్డ్, రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాట్,డ్యూయల్-టోన్ బ్లాక్ రూఫ్,టైటాన్ గ్రే మ్యాట్, స్టార్రీ నైట్ వంటి ఇతర కలర్స్‌లలో కొనుగోలుకు ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, December 15, 2024, 9:10 [IST]
English summary
Hyundai alcazar suv november 2024 sales report details
Read more on: #hyundai #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+