సర్‌ప్రైజ్‌గా మార్కెట్‌లో విడుదలైన కొత్త CNG కారు.. ధర రూ. 7.48 లక్షలు, 28 కి.మీ మైలేజీ గ్యారంటీ!
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతుంది. అంతే మొత్తంలో సీఎన్‌జీ కార్ల వినియోగం కూడా ఊపందుకుంటోంది. దీనికి ఉన్న డిమాండ్ ఆధారంగా చాలామంది సీఎన్‌జీ కార్లకు షిఫ్ట్ అవుతున్నారు. చాలా కార్ల ఉత్పత్తి సంస్థలు తమ కంపెనీలోని ఫేమస్ లైనప్‌లను సీఎన్‌జీ వెర్షన్‌లో ప్రవేశపెడుతున్నాయి. సీఎన్‌జీ కార్లు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మైలేజీని అందిస్తాయి. అంతే కాకుండా వీటిలో సరిపడా సీఎన్‌జీ లేకపోయినా.. పెట్రోల్‌తో కారుని నడపవచ్చు. అయితే వీటితో పోల్చితే ఎలక్ట్రిక్ వెహికిల్స్ వల్ల భారీ ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఛార్జింగ్ కోసం సమయం వృథా కావడం, ఛార్జింగ్ స్టేషన్ల సదుపాయం విరివిగా లేకపోవడంతో జనాలు సీఎన్‌జీకే ఓటేస్తున్నారు.
దేశంలో సీఎన్‌జీ మార్కెట్‌కి ఒడిసి పట్టడంలో మారుతి సుజుకి సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు. మార్కెట్‌లో వీటికి ఎక్కువ డిమాండ్ పెరుగుతుందని భావించి అన్ని రకాల వెహికిల్స్‌లో సీఎన్‌జీతో తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఈ విభాగంలో పేరొందిన సంస్థగా హ్యుందాయ్ మోటార్స్ ఉంది. మారుతికి పోటీగా హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఇక టాటా మాత్రం కేవలం ఎలక్ట్రిక్ వెహికిల్స్‌పై ఎక్కువ ఫోకస్ చేస్తుంది.

హ్యుందాయ్ నుంచి వస్తున్న సీఎన్‌జీ కార్లలో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని అందిస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఎక్స్‌టర్‌లో (Exter) తొలుత ప్రవేశపెట్టింది. ఆ తర్వాత గ్రాండ్ ఐ10 నియోస్ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో ప్రవేశపెట్టింది. ఇప్పుడు హ్యుందాయ్ ఆరా (Hyundai Aura CNG)ని కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో తీసుకువచ్చింది. ఈ కాంపాక్ట్ సెడాన్ హై-సీఎన్‌జీ వెర్షన్‌ని ఎటువంటి సమాచారం లేకుండా విడుదల చేసి సర్‌ప్రైజ్ చేస్తూ లాంచ్ చేసింది.
ఈ సీఎన్‌జీ కారుని కేవలం రూ. 7.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు బేస్ వేరియంట్ (E)ని మాత్రమే సీఎన్‌జీ వెర్షన్‌లో లాంచ్ చేసింది. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ ఆరా 2 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించింది. ఇప్పుడు సీఎన్‌జీ వెర్షన్‌లో తీసుకురావడం సేల్స్‌ని మరింత పెంచుతాయని కంపెనీ వెల్లడించింది.

కేవలం సింగిల్ వేరియంట్‌లో ఈ సీఎన్‌జీ వెర్షన్‌ని తీసుకువచ్చినప్పటికీ ఫీచర్ల పరంగా హ్యుందాయ్ ఎటువంటి రాజీ పడలేదు. ఇందులో ఫ్రంట్ పవర్ విండోస్, సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్ ఎత్తు అలాగే రియర్ సీట్ హెడ్‌రెస్ట్ కలవు. అంతే కాకుండా స్పీడోమీటర్‌ని సూచించే 8.89 సెంమీ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కలదు. Z-ఆకారంలోLED టెయిల్ ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి.
సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ రిమైండర్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన ABS, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఈ తాజా హ్యుందాయ్ ఆరాలో అందించారు. కావున మీ ప్రయాణంలో తగినంత సేఫ్టీ ఉంటుంది.

గ్రాండ్ ఐ10 నియోస్, ఎక్స్‌టర్‌లలోని హై-సీఎన్‌జీ 1.2-లీటర్ బై-ఫ్యూయల్ పెట్రోల్ ఇంజిన్‌తో హ్యుందాయ్ ఆరా పనిచేస్తుంది. సీఎన్‌జీ నడిచే ఈ ఇంజిన్ గరిష్టంగా 6000 rpm వద్ద 69 bhp పవర్, 4,000 rpm వద్ద 95.2 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
ఇది కిలో సీఎన్‌జీకి 28 కి.మీ మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. మార్కెట్‌లో మారుతి సుజుకి డిజైర్ సీఎన్‌జీ, టాటా టిగోర్ సీఎన్‌జీ వంటి వాటికి ఆరా సీఎన్‌జీ గట్టి పోటీ ఇవ్వనుంది. మంచి మైలేజీ తక్కువ ధరలో ప్రీమీయం ఫీచర్లను అందించే కార్ల కోసం చూస్తున్నట్లైతే మీకు ఈ హ్యుందాయ్ సరికొత్త సీఎన్‌జీ కారు సరిపోతుంది.


Click it and Unblock the Notifications








