ప్రస్తుతం ఫుల్ డిమాండ్‌లో ఉన్న కారు ఇదే.. అందుకే డెలివరీల కోసం 4-5 నెలలు ఆగాల్సిందే
భారత్‌లో హ్యుందాయ్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో క్రెటా కారు కూడా ఒకటిగా ఉంది. ఏప్రిల్ నెలలో ఈ కారు సేల్స్‌లో టాప్‌గా నిలించింది. దీనికి కారణం ఆ కారు ఇచ్చే బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరియు పనితీరు. ఈ కారుకి సంబంధించిన వేరియంట్స్ వాటి వెయిటింగ్ పీరియడ్ వివరాలు మీకోసం..
ప్రస్తుతం మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లు దూసుకెళ్తున్నాయి. నెల నెల ఈ కార్ల అమ్మకాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ కార్లను కొనుగోలు చేయాలంటే నెలల కొద్ది వెయిట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా క్రెటా కారు వెయిటింగ్ పీరియడ్ రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఈ కారుని బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ కోసం కొన్ని వారాల పాటు వేచి చూడాల్సి వస్తోంది.

ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ కారు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కోసం 4 నుంచి 5 నెలలు వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక పెట్రోల్ ఇంజన్ కోసం మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. హ్యుందాయ్ క్రెటా యొక్క టాప్-ఎండ్ ఆప్షన్ XX(O) కు భారతీయులలో భారీ డిమాండ్ ఉంది.
ఇక ఇంజిన్‌ల విషయం పక్కన పెడితే ఈ కారు వచ్చే కలర్ ఆప్షన్‌లకు సైతం డిమాండ్ అధికంగా ఉంది. ముఖ్యంగా అబిస్ బ్లాక్ (Abysse Black Creta) కలర్ ఆప్షన్‌ను అధిక సంఖ్యలో బుక్ చేసుకుంటున్నారు. హ్యుందాయ్‌లో లభించే ఇతర క్రెటా బ్లాక్ కలర్, డీజిల్ ఇంజన్ మరియు SX-O వేరియంట్ల కోసం విపరీతమైన డిమాండ్ కలిగి ఉంది.

ఇక హ్యుందాయ్ క్రెటా ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్ మరియు రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్‌లుగా ఉన్నాయి. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌గా ఉంది. ఇది గరిష్టంగా 158bhp పవర్ మరియు 253nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజిన్ హై-వేరియంట్‌లో 7-స్పీడ్ DCTట్రాన్స్ మిషన్ ఇతర వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇక 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది గరిష్టంగా 133bhp వద్ద 144nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఆప్షన్ గరిష్టంగా 114 bhp వద్ద మరియు 250nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
హ్యుందాయ్ అప్‌డేటెడ్ క్రెటా అనేక ఫీచర్లతో తీసుకువచ్చింది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ మిర్రర్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైట్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ ఉన్నాయి. ఇంకా మరెన్నో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు కూడా ఈ కారులో ఉన్నాయి.
హ్యుందాయ్ కారు ధరలు రూ. 11 లక్షల నుంచి రూ. దీని ధర రూ.20.15 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఈ కార్లకు సంబంధించి కొన్ని షోరూమ్‌ల్లో ఇన్‌స్టాంట్ డిస్కౌండ్ అందిస్తుంది. ముందస్తు బుకింగ్స్ చేసుకుంటే తప్పా ఈ కార్లు వెంటనే ఇంటికి తీసుకువ వెళ్లే అవకాశం లేదు. క్రెటాకు పెరుగుతున్న ఆదరణతో కంపెనీ ఉత్పత్తి సామార్థ్యాన్ని సైతం రెండింతలు చేసింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








