కొత్త హ్యుందాయ్‌ క్రెటా సీఎన్‌జీ వచ్చేస్తుంది.. దాదాపు 25 కి.మీ మైలేజీతో 5 మంది హాయిగా వెళ్లవచ్చు!

హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఈ కారుకి వస్తున్న స్పందనతో ఈ ఏడాది ప్రారంభంలో ఫేస్‌లిఫ్ట్‌ని సంస్థ విడుదల చేసింది. దీంతో క్రెటా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ క్యాలెండర్ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు లక్ష యూనిట్లకు దగ్గరగా క్రెటా కార్లను సేల్‌ చేసింది. తాజాగా ఈ కారు సరికొత్త వెర్షన్‌లో రాబోతుంది. దీనికి సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. టెస్ట్‌డ్రైవ్‌ చేస్తూ కనిపించిన సరికొత్త క్రెటా ఎలా ఉండబోతుంది. దీనిని ఎలా రూపొందిస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం..

స్పై చిత్రాలో కనిపించిన హ్యుందాయ్ క్రెటా పూర్తిగా కవర్ చేయబడినప్పటికీ, ఫ్రంట్ గ్రిల్, డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హెడ్ లైట్లను గమనించవచ్చు. దాదాపు టెస్టింగ్‌లో ఉండే ఈ డిజైన్‌ త్వరలో విడుదల కాబోయే వెర్షన్‌లోనూ అచ్చం ఇలానే కనిపించే అవకాశం ఉంది. ఈ అప్‌డేటెడ్‌ కారు సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌లో రానుంది. ఇప్పటికే హ్యుందాయ్ క్రెటా 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ని ప్రవేశపెట్టింది.

Hyundai-Creta-Spy-Images

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ఈ సయమంలో చాలా కంపెనీలు సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే తాజాగా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగి ఉన్న క్రెటా సీఎన్‌జీ వెర్షన్‌లో రానుంది. దీంతో కారు ప్రియులు ఈ వెర్షన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా హ్యుందాయ్‌, కియా బ్రాండ్స్ ప్రస్తుతం సరసమైన ధరలో ఎస్‌యూవీలను విడుదల చేస్తున్నాయి.

కియా కూడా సెల్టోస్‌ లైనప్‌లో సీఎన్‌జీ కారుని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు సంబంధించి టెస్ట్‌డ్రైవ్‌ కూడా చేస్తుంది. ఇక హ్యుందాయ్‌ సీఎన్‌జీ పవర్‌ట్రైయిన్‌ శక్తి మరియు టార్క్ గణాంకాలు పెట్రోల్ మోడ్‌తో పోలిస్తే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీని పనితీరులో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ సీఎన్‌జీ నిర్వహణ యజమానుల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లీటరుకు 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ విటారా సీఎన్‌జీ కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. క్రెటా సీఎన్‌జీలోనూ సేమ్‌ ఇలాంటి ఇంధన సామర్థ్య గణాంకాలను మనం ఆశించవచ్చు. ఇక గేర్ బాక్స్ ఎంపికల విషయానికి వస్తే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ప్రామాణికంగా వస్తుందని ఆశిస్తున్నాము.

ఇక హ్యుందాయ్ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ స్పెసిఫికేషన్లకు అనుగుణంగా 7-స్పీడ్ డీసీటీ యూనిట్‌ని కూడా అందించే అవకాశం ఉంది. ఇక హ్యుందాయ్ కొద్ది రోజుల క్రితం ట్విన్ సిలిండర్ టెక్నాలజీకి పేటెంట్ పొందింది. ప్రస్తుతం తమ కంపెనీ సీఎన్‌జీ కార్లలో కేవలం ఒకే సీఎన్‌జీ ట్యాంక్‌తో కార్లను విక్రయిస్తోంది. ఈ క్రెటాకు డ్యూయల్ ట్యాంక్ సెటప్‌ని అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.

లో లెవల్‌ ఎండ్ వాహనాలకు సింగిల్ సిలిండర్ కిట్లు, ఎక్కువ ప్రీమియం వాహనాలకు హై-సీఎన్‌జీ డ్యూయల్ సిలిండర్ కిట్లు అందిస్తున్నారు. టాటా ఇప్పటికే ఈ టెక్నాలజీని తన కార్లలో చేర్చింది. హ్యుందాయ్ డ్యూయల్ సిఎన్జి ట్యాంకులతో పాటు క్రెటా సిఎన్జిని విడుదల చేయనుంది. హై-సీఎన్‌జీ డుయో రాకతో సీఎన్‌జీ కార్లలో లగేజీ ఏరియా తగ్గిపోనుంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత హ్యుందాయ్ క్రెటా ఈ సీఎన్‌జీని విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో హ్యుందాయ్ కొత్త కారు గురించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ కారుకి సంబంధించిన వివరాలను సకాలంలో తెలుసుకోవడానికి మా డ్రైవ్స్‌పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ లేదా మా సోషల్ మీడియా పేజీలను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 11, 2024, 13:42 [IST]
English summary
Hyundai creta cng version spied in testing expected engine specifications and features in telugu
Read more on: #hyundai #spy pics #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+