2020 నుంచి నేటి వరకు అమ్మకాల్లో నంబర్-1 స్థానం ఆ కారుదే.. దీని తర్వాతే మరో ఆప్షన్‌కి వెళ్తున్న జనాలు!
భారతదేశంలో ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ కార్లు దుమ్మురేపుతున్నాయి. ఈ సంస్థకు చెందిన ఎస్‌యూవీలు మార్కెట్‌లోనే టాప్‌లో కొనసాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలల్లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta SUV) నంబర్ 1గా ఉంది. అలాగే మైక్రో ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) కూడా సత్తా చాటుతోంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇప్పటివరకు 1.1 మిలియన్ (11 లక్షలు) యూనిట్లకు పైగా ఈ ఎస్‌యూవీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ విక్రయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
2015 జులైలో హ్యుందాయ్ క్రెటాను ఆ సంస్థ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఈ కారు అమ్మకాల్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. ప్రతీ ఏడాది రెట్టింపు సేల్స్‌లో ఏ కారు కంపెనీకి కూడా దీని దరిదాపుల్లో కూడా రాలేదు. ఈ ఎస్‌యూవీ లాంచ్ చేసిన సంవత్సరంలోనే 40,952 యూనిట్లు సేల్ అయ్యాయి. అంటే నెలకు 5,850 యూనిట్లకు సేల్ చేసి హ్యుందాయ్ రికార్డు తిరగరాసింది.

ఆ తర్వాత ఏడాది నుంచి క్రెటా అమ్మకాలు ఊపందుకున్నాయి. 2016లో దీనికి డబుల్ మార్జిన్‌తో 92,926 యూనిట్లు, 2017లో అత్యధికంగా 1,05,484 యూనిట్లను విక్రయించింది. 2018లో 1,20,905 యూనిట్లు సేల్ అయ్యాయి. అయితే ఆ తర్వాతి రెండేళ్లు క్రెటా అమ్మకాలు కాస్త తగ్గాయి. 2019 లో 99,736 యూనిట్లకు సేల్స్ పడిపోయాయి. ఇది కంపెనీ ఓవరాల్ సేల్స్‌పై ప్రభావం చూపింది.
2020లో దీని అమ్మకాలు 96,989 యూనిట్లకు పడిపోయాయి. అయితే ఈ సంవత్సరంలో కొవిడ్ సేల్స్ తగ్గడానికి కారణం అయ్యింది. అయినా కానీ ఇతర కార్లకంటే మంచి అమ్మకాలను రాబట్టిందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఆ తర్వాతి సంవత్సరం నుంచి అమ్మకాల పెరిగాయి. 2021లో 1,25,437 యూనిట్లు, 2022లో 1,40,895 యూనిట్లు, 2023లో 1,57,311 యూనిట్లను విక్రయించి తిరుగులేని శక్తిగా అవతరించింది.

ఇక ఈ ఏడాది ముగియడానికి చాలా వారాల సమయం ఉండగానే క్రెటా ఎస్‌యూవీని ఇప్పటికే 1,41,362 మంది కొనుగోలు చేశారు. ఈ లెక్కన ఈ సంవత్సరంలోనూ అత్యధిక సేల్స్ నమోదవుతాయని కంపెనీ భావిస్తోంది. మొత్తానికి 2015 నుంచి 2024 సెప్టెంబర్ వరకు క్రెటా 11,06,095 యూనిట్లు సేల్ అయ్యాయి. 1 మిలియన్ యూనిట్ల మార్క్‌ని హ్యుందాయ్ ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకుంది.
క్రెటా కారులోని ఫీచర్లు, దాని మైలేజీ పనితీరు సేల్స్ పెరగడానికి దోహదపడుతున్నాయి. విడదలైనప్పటీ నుంచి అమ్మకాలు ఏమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే కంపెనీ కూడా ఈ కారుని ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేస్తోంది. దీంతో సేల్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. దీని ఫస్ట్ జనరేషన్ 2015 లో లాంచ్ అయిన తరువాత, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మే 2018 లో అమ్మకానికి వచ్చింది.

ఇక రెండో జనరేషన్ క్రెటాను 2020 మార్చి 16న కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో సెకండ్ జనరేషన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అమ్మకానికి ఉంది. ఈ కారు రూ. 11 లక్షల నుంచి రూ. రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మరింత మంది కస్టమర్లకు ఈ కారుని చేరువ చేసేందుకు హ్యుందాయ్ క్రెటాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








