సేల్స్‌లో టాప్‌ SUV.. ఈ కారుని నెలకు రూ. 24,780 EMI చెల్లించి మీ ఇంటికి తీసుకెళ్లండి..!!

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారుకి భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. గత కొన్ని నెలలుగా ఈ కారు కాపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తొలి స్థానంలో ఉంది. ప్రస్తుతం సేల్స్‌లో ఈ కారు జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతుంది. ఈ ఎస్‌యూవీలో ఆకర్షణీయమైన ఫీచర్లు, మంచి డిజైన్ బెస్ట్‌ ఫర్ఫామెన్స్‌ ఇంజిన్‌ కలిగి ఉండటంతో ఈ కార్లను కొనుగోలు చేసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మే నెలలోనూ ఈ కారు సేల్స్‌లో దూసుకువెళ్లింది. ప్రస్తుతం ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు టాప్‌లో కొనసాగుతుంది. మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా?? అయితే ఈ కారుకి సంబంధించిన ఆన్-రోడ్ ధర మరియు EMI ఆప్షన్స్‌ మీకోసం..

ప్రస్తుతం ఈ కార్ల ధరలను పరిశీలిస్తే.. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ పెట్రోల్ మరియు డీజిల్ పవర్ట్రెయిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. పెట్రోల్‌తో నడిచే 'E' వేరియంట్ ధర రూ. 13.72 లక్షలు, 'EX' వేరియంట్‌ ధర రూ. 15.22 లక్షలు, 'S' వేరియంట్‌ రూ. 16.72 లక్షలుగా ఉన్నాయి.

Hyundai-Creta-EMI-Options

ఇక 'SX' రూ. 19.04 లక్షలు, 'SX DT' రూ. 19.22 లక్షలు, SX (O) టర్బో DCT ధర రూ. 24.84 లక్షల వద్ద కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. పైన తెలిపిన ధరలు అన్ని ఎక్స్‌-షోరూమ్‌ ప్రకారం ఉన్నాయి. డీజిల్‌తో నడిచే మోడల్ 'E' ధర రూ. 15.64 లక్షలు, 'S' ధర రూ. 18.66 లక్షలు, 'SX (O)' ధర రూ. 19.81 లక్షలు, SX (O) ఆటోమేటిక్‌ ధర రూ. 25.25 లక్షలుగా ఉంది.

రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో కారు ప్రారంభ వెర్షన్‌ని కొనుగోలు చేస్తే 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్ల కాలానికి నెలకు రూ. 24,780 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారులోని పలు వేరియంట్లు 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో పనిచేయనున్నాయి.

Hyundai-Creta-Car-Price

ఈ వేరియంట్లలో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ, 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ఉన్నాయి. పెట్రోల్ మోడళ్లు 17.4 నుంచి 18.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. డీజిల్ వెర్షన్లు 19.1 నుంచి 21.8 కిలోమీటర్ల మైలేజీని అందించనున్నాయి. ఈ కారులోని టాప్‌ క్లాస్‌ ఇంజిన్‌లు మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి. అందువల్లే జనాలు వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ అత్యాధునిక డిజైన్‌ని కలిగి ఉంది. ఈ కారు అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్, రేంజర్ ఖాకీ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. ఇందులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. లాంగ్‌ జర్నీలో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 433 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ కూడా ఇందులో ఉంది. ఇంకా మరెన్నో అత్యాధునిక ఫీచర్లు ఈ కారులో గమనించవచ్చు.

Hyundai-Creta-On-Road-Price

ఈ హ్యుందాయ్ క్రెటాలో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ప్లే, డ్యూయల్ జోన్ ఏసీ, సన్‌రూఫ్‌, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా చూస్తే ఇది 6-డిగ్రీల ఎయిర్‌బ్యాగ్స్‌, (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) మరియు 360-డిగ్రీల కెమెరాను కలిగి ఉంది. త్వరలోనే ఈ కార్లలో అడాస్‌ లెవల్‌-2 టెక్నాలజీతో తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఈ కారు క్రెటా కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మరియు ఫోక్స్ వ్యాగన్ టిగోర్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇక్కడ మీకు తెలియజేసిన కొన్ని వేరియంట్ల ఆన్-రోడ్ ధరలు మరియు EMI ఆప్షన్‌లు ఆయా రాష్ట్రాలకు తగినట్లుగా మారుతూ ఉంటాయి. కచ్చితమైన EMI ఆప్షన్‌తో పాటు కారు ధరకు సంబంధించిన పూర్తిసమాచారం కోసం సమీప షోరూమ్‌ని సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Sunday, June 2, 2024, 16:26 [IST]
English summary
Hyundai creta emi options and variant wise price details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+