మార్కెట్‌లోకి కొత్త ఈవీ కారు వచ్చేస్తుంది.. జస్ట్‌ జనవరి 17 వరకు వెయిట్‌ చేయండి.. కచ్చితంగా దీనినే కొంటారు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనివల్ల ప్రతీ స్టార్టప్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలో ఎంజీ మోటార్ మంచి సేల్స్‌ని రాబడుతోంది. ఎలక్ట్రిక్‌ ఫోర్ వీలర్ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌ మంచి సేల్స్‌తో ఆకట్టుకుంటోంది. దేశీయ మార్కెట్‌లో ప్రపంచంలో దిగ్గజం టాటా మోటార్స్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. టాటా నెక్సాన్ ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు కంపెనీగా అవతరించింది. ఈ మధ్య ఎంజీ మోటార్స్‌కి చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్‌లో టాటా మోటార్స్‌కి గట్టి పోటీని ఇస్తున్నాయి.

దేశంలో ఎంజీ విండ్సర్ ఈవీ గత రెండు నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి రెండు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లు, కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీలు ఉన్నాయి. ఎంజీ మోటార్ భారత్‌లో అడుగు పెట్టి దశాబ్దం (2019 లో భారత్‌లోకి ఎంట్రీ) కాలేదు అయినా కానీ ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా రాణిస్తున్నాయి.

Hyundai Creta EV Launch

గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లకు దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో JSW ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్‌లో ఈ ఎంజీ సహా ఇతర కంపెనీల కార్లు మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. మాస్‌ మార్కెట్‌లో గట్టి పోటీని ఇవ్వాలనే లక్ష్యంతో హ్యుందాయ్ త్వరలోనే సరికొత్త కారుని రంగంలోకి దింపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌పై హ్యుందాయ్‌ పూర్తిగా దృష్టి సారించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రెటా ఈవీ వెర్షన్ క్రెటా ఈవీ భారత మార్కెట్‌లో త్వరలోనే లాంచ్ కానుంది. ఈ క్రెటా ఈవీకి 2024 జనవరి 17న లాంచ్ కానుంది. భారత్ మొబిలిటీ షో 2025 జనవరిలో భారత్‌లో జరగనుంది. 2025 ఆటో ఎక్స్ పోలో హ్యుందాయ్ తొలిసారిగా క్రెటా ఈవీని ప్రదర్శించనుంది.

ఇప్పటి వరకు ఈ కారు మార్కెట్‌లో అందుబాటులో లేదు. ఇది లాంచ్ అయితే టాటా కర్వ్ ఈవీ, ఎంజీ ZS, ఇటీవల లాంచ్ చేసిన మహీంద్రా BE 6 లకు గట్టి పోటీని ఇస్తుంది. దీంతో పాటు ప్రస్తుతం టాప్‌లో కొనసాగుతున్న విండ్సర్ ఈవీకి సైతం గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ హై స్పెసిఫికేషన్లు, ప్రత్యేకమైన స్టైలింగ్‌తో మార్కెట్‌లోకి రానుంది.

ఈ క్రెటా ఈవీ గతంలో కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కోనా ఈవీకి కొనసాగింపుగా రానుంది. ఈ ఎస్‌యూవీ ఢిఫరెంట్‌ గ్రిల్‌తో పాటు, ఎల్ ఆకారంలో ఉండే LED DRL, కుడి, ఎడమ వైపులా రెండు స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, ఆకట్టుకునే డిజైన్‌లో బంపర్, క్రోమ్ స్ట్రిప్‌తో క్రెటా ఈవీ అందుబాటులోకి రానుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 138 hp పవర్‌ని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

ఇక ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర కార్లతో సమానంగా 400 కిలోమీటర్ల నుంచి 450 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని భావిస్తున్నారు. ఈ క్రెటా ఈవీ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ షో ద్వారా కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇది మార్కెట్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటి ఎదురుకానుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2024, 19:56 [IST]
English summary
Hyundai creta ev launching on january 17 check detals here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+