Hyundai Creta Facelift 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు ప్రారంభం.. కలర్స్, ఫీచర్లు అదుర్స్
హ్యుందాయ్ మోటార్స్ నుంచి భారీ అంచనాలతో ఇటీవల సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 విడుదలైంది. కస్టమర్లలో క్రెటా ఫేస్‌లిఫ్ట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో పెద్ద ఎత్తున ఈ కారు బుకింగ్‌లను సంపాదించుకుంది. దీంతో తాజాగా ఈ సరికొత్త మోడల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దేశంలోనే క్రెటా డెలివరీకి సంబంధించి మొట్టమొదటి వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు.
భారత్‌లో హ్యుందాయ్ క్రెటా 2024 డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఆధునిక ఫీచర్లు, సరికొత్త టెక్నాలజీతో భారీ అంచనాలు, మోస్ట్ అవైటైడ్ ఎస్‌యూవీగా ఈ సరికొత్త కారు ఇటీవల విడుదలైంది. కాగా కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో సంస్థ విడుదల చేసింది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20 లక్షల వరకూ ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 మొదటి కారు డెలివరీ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో ఈ కారు డెలివరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో కొత్త హ్యుందాయ్ క్రెటా కస్టమర్‌కు మరిచిపోలేని అనుభవాన్ని డీలర్‌షిప్ సిబ్బంది అందించినట్లుగా కనిపిస్తోంది.
కాగా కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ విషయానికొస్తే ఇందులో బేస్ E వేరియంట్‌ను రూ. 10.99 లక్షల ధరతో సంస్థ ప్రారంభించింది. టాప్ ఎండ్ వేరియంట్ SX(O) రూ. 20 లక్షల వరకూ ఉంది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ E, EX, S, S(O), SX, SX Tech మరియు SX(O) వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ కొత్త కాంపాక్ట్ హ్యుందాయ్ క్రెటా SUV ని 7 కలర్స్‌లో సంస్థ ప్రవేశపెట్టింది. అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్, రోబస్ట్ ఎమరాల్డ్ పెర్ల్, ఫైరీ రెడ్, రేంజర్ ఖాకీ, టైటాన్ గ్రే, అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. కాగా ఇప్పటికే భారత మార్కెట్లో మిడ్ లెవెల్ క్రెటా ఎస్‌యూవీ అత్యంత ప్రజాదరణ పొందుతోంది.
కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో సంస్థ చాలా అప్‌డేట్లను తీసుకువచ్చింది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పరంగా అధునాతన మార్పులను చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. క్యాబిన్ విషయానికొస్తే.. ఇంటీరియర్‌ను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. 10.25 అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ గేజ్ క్లస్టర్‌ను కలిగి ఉంది.

ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రోక్రోమిక్ IRVM, యాంబియంట్ లైటింగ్, ADAS లెవల్ 2, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 360-డిగ్రీ కెమెరా, సెంటర్ ఆర్మ్‌రెస్ట్, మరియు పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. మునుపటి మాదిరిగానే అదే ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 1.5-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.. 6-స్పీడ్ మాన్యువల్, IVT మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అదనంగా వస్తున్న 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 PS మరియు 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








