Hyundai Creta Facelift 2024 కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ధర, ఫీచర్లు, ఇతర వివరాలివే.!!

భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌(Hyundai Creta Facelift Launch) నేడు విడుదల అయింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కొత్త క్రెటాను హ్యూందాయ్‌ మోటార్స్‌ లాంచ్ చేసింది. ధర, ఫీచర్లు, ఇంజిన్‌ పర్ఫామెన్స్‌ పూర్తి వివరాలు ఈ కథనంలో..

దేశంలో ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్‌ మోటార్స్‌ కస్టమర్లలో మంచి ప్రజాదరణ కలిగి ఉంది. కాగా ఇప్పటికే హ్యుందాయ్‌ క్రెటా(Hyundai Creta Facelift) మార్కెట్లో మంచి డిమాండ్‌ను కలిగి ఉంది. ఇంకా ఇప్పుడు సరికొత్తగా హ్యుందాయ్‌ క్రెటాను సంస్థ అప్‌డేట్‌ చేసింది. ఫేస్‌లిఫ్టెడ్‌ క్రెటా బోల్డ్‌గా, ADAS వంటి ఆధునిక సాంకేతికతతో క్రెటా లాంచ్‌ అయింది.

Hyundai-Creta-Facelift

కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 2024 ను హ్యుందాయ్‌ మోటార్స్ రూ. 11 లక్షల(ఎక్స్‌ షోరూమ్‌) ప్రారంభ ధరతో విడుదల చేసింది. వేరియంట్ల ప్రకారం ధరలు మారుతుంటాయి. కాగా హ్యుందాయ్‌ క్రెటా E, EX, S, S (O), SX, SX Tech మరియు SX (O) అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌ విషయానికొస్తే.. మరింత బోల్డ్‌గా కనిపిస్తుంది. కనెక్ట్ చేయబడిన లైటింగ్ సెటప్‌లతో పాటు ముందు మరియు వెనుక వైపున రీడిజైన్‌ చేశారు. తద్వారా ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రీడిజైన్ చేయబడిన గ్రిల్‌తో పాటు ఫ్రంట్ ఎండ్, హుడ్ అంతటా పొడవైన LED DRL స్ట్రిప్ మరియు తాజా సెట్ LED హెడ్‌లైట్లు రీడిజైన్‌ చేయబడి ఉన్నాయి.

Hyundai-Creta-Facelift

కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్(New Hyundai Creta Facelift) దిగువ విభాగంలో ఇప్పుడు మరింత బలమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో ఆకర్షణీయంగా ఉంది. సైడ్‌ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా కొత్త అల్లాయ్‌ వీల్స్‌ కారుకు మరింత లుక్‌ను జోడించింది. బంపర్‌ను పాత క్రెటా మాదిరిగానే ఉండటంతో పాటు చంకీ సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌ను కలిగి ఉంది.

Hyundai-Creta-Facelift

2024 హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఇంటీరియర్ పరంగా చాలా మార్పులకు గురైంది. ఇందులో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు.. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం మరియు మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం అందించారు. కాగా సైడ్ డ్యాష్‌బోర్డ్ ఎగువ విభాగం ఇప్పుడు పియానో ​​బ్లాక్ ప్యానెల్‌తో ఉండగా.. దాని క్రింద లైటింగ్‌తో ఓపెన్ స్టోరేజ్ స్పేస్‌ను చూడవచ్చు.

Hyundai-Creta-Facelift

కొత్త 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు.. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్‌ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 360-డిగ్రీ కెమెరా మరియు డ్యూయల్-జోన్ AC సిస్టమ్‌ మరో ప్రత్యేకత. ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇక సేఫ్టీ ఫీచర్లను చూసుకుంటే కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌.. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)ను కలిగి ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ నియంత్రణ (ESC) వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

Hyundai-Creta-Facelift

కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఇంజిన్‌ విషయానికొస్తే.. పాత వెర్షన్‌ మాదిరిగానే 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను అలాగే తీసుకున్నారు. వీటితో పాటు వెర్నా నుంచి 1.5-లీటర్ టర్బో యూనిట్‌ను కూడా సంస్థ అందిస్తోంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ 115 PS, 144 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, CVT తో జత చేయబడి ఉంటుంది.

కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 160 ps పవర్‌ మరియు 253 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7 స్పీడ్‌ DCT తో జత చేయబడి ఉంటుంది. 1.5 లీటర్‌ టర్బో ఛార్జ్‌డ్‌ ఇంజిన్‌ 116 PS పవర్‌, 250 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ మ్యాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

Hyundai-Creta-Facelift

కాగా భారత మార్కెట్లో కొత్త ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్ , మారుతి గ్రాండ్ విటారా , టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, MG ఆస్టర్, వోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లకు గట్టి పోటీగా విడుదలైంది. కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ బుకింగ్‌లు ప్రారంభం కాగా.. ఆన్‌లైన్‌ లేదా సమీప డీలర్‌షిప్‌ల ద్వారా కస్టమర్లు కారును బుక్‌ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 16, 2024, 14:45 [IST]
English summary
Hyundai creta facelift 2024 launched in india price features specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+