హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ కారుకు భారీ డిమాండ్‌..నెలరోజుల్లోనే 51,000 బుకింగ్‌లు..కారు ప్రత్యేకతలు తెలుసా?

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ జనవరిలో విడుదల అయింది. పాత మోడల్‌తో పోలిస్తే.. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ (Hyundai creta Facelift) అనేక డిజైన్‌, ఫీచర్‌ మార్పులను కలిగి ఉంది. ఫలితంగా ఈ మోడల్‌ భారీ డిమాండ్‌ను సంపాదించుకుంది. జనవరిలోనే ఈ కారు బుకింగ్‌లు ప్రారంభం కాగా.. కేవలం విడుదలైన నెల రోజుల్లో ఏకంగా 51000 బుకింగ్‌లను సొంతం చేసుకుంది.

భారత్‌ మార్కెట్‌లో హ్యుందాయ్‌ క్రెటా చాలా సంవత్సరాలుగా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ విక్రయాలను మరింత వృద్ధి చేసేందుకు వీలుగా హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ (2024 Hyundai creta) వెర్షన్‌ను విడుదల చేసింది. జనవరిలోనే ఈ కారు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. బుకింగ్‌లపై సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

Hyundai creta Facelift latest news

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ప్రారంభ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.19.99 లక్షల (ఎక్స్‌షోరూం) మధ్య ఉంది. ఈ ధరలు కేవలం ప్రారంభ ధరలు మాత్రమే.. లాంచింగ్‌ సందర్భంగా ఈ ధరను కలిగి ఉంది. తర్వాత కాలంలో ఈ కారు ధరలు పెరిగే అవకాశం ఉంది.

హ్యుందాయ్‌ క్రెటా 2 జనరేషన్‌ కారును 2020 లో ప్రారంభించింది. అనంతరం ఈ సంవత్సరం జనవరిలో అనేక అప్‌గ్రేట్‌లతో మళ్లీ విడుదల చేసింది. ముఖ్యంగా ఇంటీరియర్‌తో పోలిస్తే ఎక్స్టీరియర్‌లో అనేక మార్పులను చేసింది. దీంతోపాటు ఫీచర్లను అప్‌డేట్‌ చేసింది. ప్రీమియం ఫీచర్లను జతచేసింది. ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా ఇంటీరియర్‌లో మార్పులు చేశారు.

Hyundai creta Facelift achieves 51000 bookings in one month

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ 1.5 లీటర్‌ పెట్రోల్‌, డిజిల్‌ ఇంజిన్లు సహా 1.5 లీటర్‌ టర్భో ఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ 160ps శక్తి, 283Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్‌ DCT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ రీడిజైన్ చేయబడిన గ్రిల్‌తో పాటు ఫ్రంట్ ఎండ్, పొడవైన LED DRL స్ట్రిప్ మరియు LED హెడ్‌లైట్లు రీడిజైన్‌ చేయబడి ఉన్నాయి. E, EX, S, SO, SX, SX Tech మరియు SXO వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ SUV 6 సింగిల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్‌ మరియు ఒక డ్యూయల్ టోన్‌ కలర్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

Hyundai creta Facelift

భద్రతా పరంగా ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు లెవల్‌ 2 ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌) ను కలిగి ఉంది. ఈ ఇది 19 భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు 360-డిగ్రీ కెమెరా, టైర్‌ ప్రజర్‌ మానిటరింగ్‌ వ్యవస్థ, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ ను కలిగి ఉంటుంది.

ఫీచర్ల పరంగా ఈ SUV 10.25 అంగుళాల రెండు డిస్‌ప్లేలను కలిగి ఉంది. టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌గా మరొకటి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌గా పనిచేస్తుంది. దీంతోపాటు వాయిస్‌ ఎనేబుల్డ్‌ సన్‌రూఫ్‌, పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్ సీట్లు, అప్‌డేటెడ్‌ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, డ్యూయల్-జోన్ AC సిస్టమ్‌, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 7, 2024, 13:02 [IST]
English summary
Hyundai creta facelift achieves 51000 bookings in one month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+