జనాలు ఎక్కువగా కొంటున్న కారు ఇదే.. రోజుకు 550 కార్లు అమ్ముతున్న కంపెనీ.. ఆరు నెలల్లోనే అన్ని కార్లు కొనేశారా?
ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా గత కొన్ని నెలలుగా టాప్‌లో కొనసాగుతుంది. ఈ విభాగంలో ఇతర కార్ల కంపెనీలు ఈ అధునాతన ఎస్‌యూవీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నా.. ఆ కారు సేల్స్‌కి దగ్గర్లోని ఫిగర్‌ని సైతం అందుకోవడం లేదు. ప్రస్తుతం అప్‌డేటెడ్ హ్యుందాయ్ ఫేస్‌లిఫ్ట్‌కి భారత మార్కెట్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సరికొత్త రికార్డ్‌ని నమోదు చేసింది. దేశంలో కేవలం ఆరు నెలల్లో 1 లక్షకు పైగా యూనిట్లకు పైగా విక్రయించింది. హ్యుందాయ్ ఈ ఏడాది జనవరిలో అప్‌డేటెడ్ క్రెటా ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ సేల్స్ రిపోర్ట్ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
హ్యుందాయ్ క్రెటా మోడల్‌కి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది. ప్రస్తుత సేల్స్ రిపోర్ట్ ప్రకారం.. క్రెటా రోజుకు 550 యూనిట్లు అమ్ముడవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని నెలుగా ఈ కారు మోడల్ క్రమం తప్పకుండా బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో నంబర్ 1గా కొనసాగుతుంది. వినియోగదారులకు మరితం చేరువ అయ్యేందుకు ఈ ఏడాది జనవరిలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని విడుదల చేసింది.

పూర్తి అప్‌డేట్స్‌తో మార్కెట్‌లోకి వచ్చిన క్రెటా ఫేస్‌లిఫ్ట్.. మరింత ప్రీమియం కారుగా రూపాంతరం చెందింది. ఇందులో కనెక్ట్ చేయబడిన LED DRLs, కొత్త బంపర్ మరియు గ్రిల్ భాగం మరింత ఆకర్షణీయంగా తీసుకువచ్చింది. ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్ (ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ స్క్రీన్), వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.
ఇవే కాకుండా క్విక్ క్యాబిన్ కూలింగ్ కోసం ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ పవర్ సీట్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీల రియర్ కెమెరా, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కొత్త హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 115 PS శక్తిని విడుదల చేసే 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్.. 160 PS పవర్‌ని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఇక 116 PS శక్తిని ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.
ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరీమ్) ధర నుంచి రూ.20.15 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. క్రెటా ఎస్‌యూవీ చాలా కాలంగా భారతీయుల ఫేవరెట్ కార్ మోడల్‌గా ఉంది. తాజాగా కేవలం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లోనే 1 లక్ష యూనిట్లకు పైగా అమ్మకాలతో టాప్‌లో దూసుకెళ్తుంది. ఈ కారు రాబోయే కాలంలో భారత్‌లోనే అత్యధికంగా అమ్ముడవుతన్న కారుగా రికార్డ్ కొట్టనుంది.
ఇక హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ని త్వరలో తీసుకురానుంది. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే హ్యుందాయ్ ఆరంభించింది. త్వరలోనే ఈ కారుకి సంబంధించిన మోటార్, రేంజ్ ఇతర స్పెసిఫికేషన్స్‌ని వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ దృష్టి సారించింది. తన ఫేమస్ లైనప్‌ని తీసుకురావడంతో టాటా కార్ల ఆధిపత్యానికి చెక్ పెట్టాలని హ్యుందాయ్ చూస్తోంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








