అప్పుడే మొదలైన Hyundai Creta N Line బుకింగ్స్ - పూర్తి వివరాలు

హ్యుందాయ్ ఇండియా లాంచ్ చేయనున్న కొత్త 'క్రెటా ఎన్ లైన్' కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈSUVని దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసిన తరువాత డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కథనంలో బుకింగ్ ప్రైస్, ఇతర వివరాలు తెలుసుకుందాం.

హ్యుందాయ్ యొక్క కొత్త క్రెటా ఎన్ లైన్ కోసం ఇప్పుడు రూ. 25000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త SUV ఈ నెల 11న (మార్చి 11) దేశీయ విఫణిలో లాంచ్ అవుతుంది. ఇది దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే స్పోర్టియర్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పొందుతుంది. దీని ధర సాధారణ క్రెటా కంటే కూడా రూ. 50000 ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.

Hyundai Creta N Line Bookings Start

ఇప్పటికే వెల్లడైన సమాచారం ప్రకారం, ఈ SUV కొత్త గ్రిల్, బంపర్ వంటివి స్పోర్టియర్ ఫ్రంట్ ఎండ్‌ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో చాలా వరకు యాంగ్యులర్ కట్స్, విశాలమైన ఎయిర్ ఇన్‌లెట్‌లు, బుల్ బార్ వంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇందులోని హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి.

క్రెటా ఎన్ లైన్ రెడ్ కలర్ యాక్సెంట్‌లతో సైడ్ స్కర్ట్స్, ఎన్ లైన్ బ్యాడ్జెస్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. బ్రేక్ కాలిపర్లు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. వెనుక వైపు రూప్ మౌంటెడ్ స్పాయిలర్, డిఫ్యూజర్‌తో స్పోర్టియర్ బంపర్ కలిగి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కొత్త SUV ఇప్పుడు బ్లాక్ రూప్ కలిగి దందర్ బ్లూ కలర్ ఆప్షన్ పొందుతుంది.

Hyundai Creta N Line Rear Profile

హ్యుందాయ్ కంపెనీ ఇంకా తన క్రెటా ఎన్ లైన్ యొక్క ఇంటీరియర్ చిత్రాలను వెల్లడించలేదు, కానీ ఇందులోని డ్యాష్‌బోర్డ్, క్యాబిన్ అంతటా కాంట్రాస్ట్ రెడ్ యాక్సెంట్‌లతో ఆల్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతుందని తెలుస్తోంది. ఎన్ లైన్ అప్‌డేట్‌లను కలిగిన స్టీరింగ్ వీల్, గేర్ లివర్, మెటల్ పెడల్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 160 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ పొందనున్నట్లు సమాచారం. క్రెటా ఎన్ లైన్ చాలా రీట్యూన్ చేయబడిన సస్పెన్షన్ సెటప్, స్టీరింగ్ డైనమిక్స్ మరియు స్పోర్టియర్ ఎగ్జాస్ట్ పొందుతుంది.

Hyundai Creta N Line Safety

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌కు దేశీయ విఫణిలో లాంచ్ అయిన తరువాత ప్రత్యక్ష ప్రత్యర్థి ఉండదు. కానీ ఈ విభాగంలో కియా కంపెనీకి చెందిన సెల్టోస్ ఎన్ లైన్, స్కోడా కంపెనీకి చెందిన కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ వంటి కొన్ని స్పెషల్ ఎడిషన్ దీనికి కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అమ్మకాల పరంగా క్రెటా ఎన్ లైన్ కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 1, 2024, 10:55 [IST]
English summary
Hyundai creta n line bookings start at rs 25000 launch in india on march 11
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+