హ్యుందాయ్ లాంచ్ చేయనున్న కొత్త కారు ఇదే.. ఓ లుక్కేసుకోండి
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ సంస్థ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ లాంచ్ చేసిన తరువాత క్రెటా ఎన్ లైన్ వేరియంట్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
హ్యుందాయ్ లైనప్‌ను మరింత విస్తరించడంతో భాగంగానే.. 'క్రెటా ఎన్ లైన్' (Hyundai Creta N Line) వేరియంట్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీనికి వచ్చే నెల (మార్చి 11) రెండవ వారంలో అధికారికంగా లాంచ్ చేయనుంది. ధరలు కూడా అప్పుడే వెల్లడవుతాయి. కంపెనీ ఈ కారు కోసం ఈ నెల చివరి నుంచి బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది.

ఇప్పటికి లీక్ అయిన క్రెటా ఎన్ లైన్ ఫోటోల ప్రకారం కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ మోడల్ అప్డేటెడ్ డిజైన్ పొందినట్లు తెలుస్తోంది. అయితే లోపలి భాగంలో ఎలాంటి అప్డేట్స్ పొందిందనే విషయం ప్రస్తుతానికి అందుబాటులో లేదు, కానీ తప్పకుండా కొంత అప్డేట్ అయి ఉంటుందని భావిస్తున్నాము. ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్లకు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.
కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ స్పోర్టి డిజైన్ కలిగి, ముందు భాగంలో సన్నగా ఉండే గ్రిల్, యాంగ్యులర్ కట్స్, విశాలమైన ఎయిర్ ఇన్‌లెట్‌లు మాత్రమే కాకుండా.. దిగువ భాగంలో బుల్ బార్ వంటి ఎలిమెంట్ కలిగి సరికొత్త బంపర్ కలిగి ఉంటుంది. అయితే హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఏ మాత్రమే మారే అవకాశం లేదని తెలుస్తోంది.

అక్కడక్కడా క్రెటా ఎన్ లైన్ రెడ్ యాక్సెంట్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం, అంతే కాకుండా.. ఎన్ లైన్ బ్యాడ్జింగ్ మరియు కొత్త డిజైన్ కలిగిం పెద్ద 18 ఇంచెస్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. వెనుక వైపు పెద్ద రూప్ మౌంటెడ్ స్పాయిలర్, డిఫ్యూజర్ మరియు డ్యూయెల్ ఎగ్జాస్ట్ టిప్స్‌తో బంపర్ ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.
బ్లూ మరియు మ్యాట్ గ్రే కలర్ అనేక రెండు కొత్త కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు, లోపలి భాగంలో పెద్దగా అప్డేట్స్ పొందబోదని.. చిన్న అప్డేట్స్ ఉండొచ్చని సమాచారం. కాబట్టి ఇందులో డ్యూయెల్ టోన్ గ్రే బ్లాక్ ఫినిషింగ్ కాకుండా ఆల్ బ్లాక్ ఫినిషింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే స్టీరింగ్ వీల్, గేర్ లివర్ మరియు రెడ్ యాక్సెంట్స్ వంటి వాటికి N లైన్ బ్యాడ్జ్ పొందవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఎన్ లైన్ క్రెటా అదే 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. కావున ఇది 160 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది, అదనంగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఇందులో లభించే అవకాశం ఉంది.
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంచ్ అయిన తరువాత మార్కెట్లో మిడ్-సైజ్ SUV విభాగంలో ప్రధాన ప్రత్యర్థి ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ అమ్మకాల పరంగా ఇది కియా సెల్టోస్ ఎక్స్ లైన్, స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ వంటి కొన్ని స్పెషల్ మోడల్స్ పోటీ వచ్చే అవకాశం ఉంది. క్రెటా ఎన్ లైన్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ ధరలు పొందవచ్చని సమాచారం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








