హ్యుందాయ్‌ N లైన్‌ సిరీస్‌ నుంచి కొత్త వాహనం ఫోటోలు లీక్‌.. నయా లుక్ సహా లగ్జరీ ఫీచర్లు..!!

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొద్దిరోజుల క్రితం ఇటీవలే భారత్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ 2024 క్రెటా డిజైన్‌ సహా ఇతర ఫీచర్లతో వేగంగా కస్టమర్లను ఆకట్టుకుంది. అంతలోనే హ్యుందాయ్‌ మరో కొత్త స్పోర్ట్‌ మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే N లైన్‌లో రెండు వాహనాలు : పూణేలో యాడ్‌ షూట్‌ సందర్భంగా కొత్త హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ (Hyundai Creta N Line) కనిపించింది. హ్యుందాయ్‌ N లైన్‌ సెగ్మెంట్‌లో ఇప్పటికే i20 N లైన్‌, వెన్యూ N లైన్‌ అందుబాటులో ఉండగా.. మరికొన్ని రోజుల్లో క్రెటా N లైన్‌ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Hyundai Creta N Line photos leaked during ad shoot

స్టాండర్డ్‌ మోడల్‌ కార్లనే కాకుండా స్పోర్ట్స్‌ లుక్‌ మోడల్‌ వాహనాలను కోరుకొనే వారికోసం హ్యుందాయ్‌ ఈ క్రెటా N లైన్‌ SUVని తీసుకొస్తోంది. i20 N లైన్‌, వెన్యూ N లైన్‌ వేరియంట్ల తరహాలో క్రెటా N లైన్‌ అనేక మార్పులను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం బయటకొచ్చిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ ఫోటోల్లో కనిపిస్తున్న కారు థండర్‌ బ్లూ రంగును కలిగి ఉంది. అలాగే మ్యాట్‌ గ్రే కలర్‌ వేరియంట్‌ను కలిగి ఉంది. వైరల్‌ అవుతున్న ఫోటోల ఆధారంగా ఈ కారు సైడ్‌ ప్రోఫైల్ వద్ద రెడ్‌ లైన్‌ను గమనించవచ్చు. దీంతోపాటు ఈ కారు వెనుక భాగంలో N లోగోను గుర్తించవచ్చు.

Hyundai Creta N Line photos spied here are the specs and features

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ SUV ఇంటీరియర్‌ ఆల్‌ బ్లాక్‌ థీమ్‌ రంగులో ఉంటుంది. AC వెంట్స్‌, సెంటర్‌ కన్సోల్‌, డోర్‌ ప్యానల్‌, గేర్‌ షిఫ్టర్‌, డోర్‌ ప్యానల్‌ కూడా ఎరుపు రంగులో ఉంటాయి. స్టీరింగ్ వీల్‌, సీట్లు, పెడల్స్‌పైన N బ్యాడ్జి ఉంటుంది. ఈ కారు స్టాండర్డ్‌ వేరియంట్‌ 16 లేదా 17 అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ వాహనం టచ్‌స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ డ్రైవర్ కన్సోల్‌తో కూడిన డ్యూయల్ 10.25 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 8-స్పీకర్‌ బోస్ ఆడియో సిస్టమ్‌ సహా అనేక కనెక్టడ్‌ ఫీచర్ల ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, వెంటిలెటెడ్ సీట్లను కలిగి ఉంటాయి.

Hyundai Creta N Line latest car

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ ఇంజిన్‌ : ఈ హ్యుందాయ్‌ SUV 1.5 లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ మాన్యువల్‌, 7-స్పీడ్‌ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ జతచేయబడే అవకాశం ఉంటుంది. ఈ ఇంజిన్‌ 158 bhp శక్తి, 253Nm గరిష్ఠ టార్క్‌ను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్‌ క్రెటా N లైన్‌ స్టాండర్డ్‌, ఎకో, స్పోర్ట్‌ వంటి డ్రైవింగ్‌ మోడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు క్రెటా N లైన్‌.. ఆటోమేటిక్‌ వేరియంట్‌ ప్యాడిల్‌ షిఫ్టర్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటికే హ్యుందాయ్‌ 10వేల హ్యుందాయ్‌ వాహనాలను విక్రయించింది. ఈ కొత్త వేరియంట్‌తో వార్షిక విక్రయాలను 15 వేల నుంచి 20 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

Hyundai Creta N Line photos leaked

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, January 29, 2024, 17:11 [IST]
English summary
Hyundai creta n line photos spied here are the specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+