Hyundai Creta N Line Full Review Video స్పోర్టియర్‌ హ్యుందాయ్‌ క్రెటా N లైన్ ఫుల్‌ రివ్యూ వీడియో

హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసిన రెండు నెలల లోపే, హ్యుందాయ్ క్రెటా N లైన్‌ను సంస్థ విడుదల చేసింది. లుక్‌ మరియు ఫీచర్ల పరంగా ఇందులో చాలా అప్‌డేట్లను చూడవచ్చు. ఈ మేరకు ఢిల్లీ రోడ్లపై నిర్వహించిన టెస్ట్‌ డ్రైవ్‌లో మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ పరిశీలించిన డిజైన్‌, ఫీచర్లు, స్పెక్స్‌, పనితీరు పూర్తి రివ్యూ వీడియో ఈ కథనంలో..

కొత్త హ్యుందాయ్‌ క్రెటా ఎన్ లైన్ ఎక్స్‌టీరియర్‌ పరంగా కొత్త బంపర్‌లు, మరింత గుర్తించదగిన సైడ్ స్కర్ట్‌లు ఉంటాయి. లో ప్రొఫైల్‌ను చూసుకుంటే 215/55 R18 టైర్‌లలో 18-అంగుళాల చక్రాల కొత్త సెట్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఆల్‌ బ్లాక్‌ థీమ్‌కు వ్యతిరేకంగా క్యాబిన్.. రెడ్ యాంబియంట్ లైటింగ్ ద్వారా మరింత హైలైట్ అవుతూ ఆకర్షణీయంగా ఉంటుంది.

సాధారణ క్రెటాతో పోల్చితే కొత్త హ్యుందాయ్ క్రెటా N లైన్‌లో కొద్దిగా ట్వీక్ చేయబడిన సస్పెన్షన్ మరియు స్టీరింగ్ సెటప్ మరియు కొత్త ఎగ్జాస్ట్‌ను చూడవచ్చు. పెద్ద పనోరమిక్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (డ్రైవర్ సీట్ 8-వే పవర్డ్ యూనిట్), ఇన్‌స్ట్రుమెంటేషన్. ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు. డ్యూయల్-డాష్ క్యామ్, డ్యూయల్-జోన్ క్లైమేట్‌, కంట్రోలింగ్‌, బోస్ 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ ఫీచర్లు డ్రైవర్‌ ఫ్రెండ్లీగా ఉంటాయి.

Hyundai-Creta-N-Line-Features-Design-Specs-Full-Review-Video

సేఫ్టీ ఫీచర్ల పరంగా కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్‌.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, TPMS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లెవల్ 2 ADAS వంటి ఫీచర్‌లతో వస్తుంది. ఇంజిన్‌ పరంగా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,500 rpm వద్ద 158 bhp మరియు 1,500 మరియు 3,500 rpm మధ్య 252 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, March 15, 2024, 11:54 [IST]
English summary
Hyundai creta n line suv performance full review video is here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+