ఇంకా టాప్‌లోనే కొనసాగుతున్న ది బెస్ట్‌ ట్రస్టెడ్‌ కారు.. దీనిని ఢీకొట్టే కారు వచ్చేనా?

హ్యుందాయ్ క్రెటా కారుకి భారత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. గత నెల ఏప్రిల్‌లో ఈ కారు విక్రయాలు మారుతి గ్రాండ్ విటారా కంటే రెండింతలు ఎక్కువ సాధించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కార్లతో పోల్చితే హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ వైపే జనాలు చూస్తున్నారు. మారుతి గ్రాండ్ విటారా సేల్స్‌ని అధిగమించి ఈ కారు టాప్‌లో నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా మరోసారి భారతదేశంలో ఎక్కువగా సేల్‌లో ఉన్న కాంపాక్ట్ SUVగా నిలిచింది. గత ఏప్రిల్ 2024లో హ్యుందాయ్ దేశ వ్యాప్తంగా మొత్తం 15,447 యూనిట్ల క్రెటా కార్లను విక్రయించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాలతో పోల్చితే ఇది రెండు రెట్లు అధికం. గత నెలలో గ్రాండ్ విటారా విక్రయాలు 7,651 యూనిట్లుగా ఉన్నాయి.

Hyundai-Creta

మొత్తం మార్కెట్‌లోనే హ్యుందాయ్ క్రెటా 39.76 శాతంతో అధిక వాటాను కలిగి ఉంది. కాంపాక్ట్ SUV విభాగంలో ఈ కారుదే హవా. హ్యుందాయ్‌ క్రెటాలో పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్‌లు ఉన్నాయి. అంతే కాకుండా ఇది 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్‌తో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడా వస్తుంది.

ఇందులో 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, ADAS లెవెల్ 2 మరియు ఇతర అధునాతన ఫీచర్లను గమనించవచ్చు. అదిరిపోయే స్పోర్టీ డిజైన్‌లో ఈ కారుని హ్యుందాయ్‌ రూపొందించింది. కారులోని ఫీచర్లు ఇతర అంశాలు సేల్స్‌లో ఈ కారు టాప్‌లో నిలిపింది. ఇతర కార్లలోని లేని ఫీచర్లు స్టాండర్డ్‌ డిజైన్‌, ఫర్ఫామెన్స్‌ ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఈ కారు టాప్‌లో నిలించింది.

Hyndai-Creta-Alpha

మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం కోసం హ్యుందాయ్ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఈ కారు 1.5-లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌లో 113 bhp వద్ద 144 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 114 bhp వద్ద 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సరికొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 158 bhp వద్ద 253 Nm టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు.

ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అన్ని వేరియంట్‌లలో వస్తుంది. కానీ పెట్రోల్ వేరియంట్ IVT ఆప్షన్‌ని కలిగి ఉంది. డీజిల్ ఇంజిన్‌లో 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌, టర్బో పెట్రోల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సిటీలో క్రెటాను కొనుగోలు చేయాలనుకునే వారు IVT నేచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

అదే సమయంలో, ప్రధానంగా హైవేలపై డ్రైవింగ్ చేసే వ్యక్తులు డీజిల్ లేదా టర్బో పెట్రోల్‌ మంచి ఎన్నిక. అలాగే మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునే వారు టర్బో పెట్రోల్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. బడ్జెట్‌లో క్రెటా కారు కొనుగోలు చేయాలనుకునే వారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పెట్రోల్ వేరియంట్‌కి వెళ్లవచ్చు. భారతీయ మార్కెట్లో క్రెటా తన మార్కెట్‌ తగ్గకుండా ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌ వేరియంట్లలో కార్లను విడుదల చేస్తుంది.

కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్తగా వేరియంట్లను సంస్థ తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఫేస్‌లిఫ్ట్‌లు మరియు N-లైన్ వంటి ప్రత్యేకమైన లైనప్‌లలో కార్లను విడుదల చేసింది. ఇప్పటికే భారీ జనాదరణను కలిగిన ఈ కాంపాక్ట్ SUV. భవిష్యత్‌లోనూ ఇలాంటి సేల్స్‌లో దూసుకుపోతే అతి త్వరలోనే భారతీయ మార్కెట్‌ని శాసించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 17:54 [IST]
English summary
Hyundai creta no 1 in compact suv sales still top in this section
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+