21.8 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారు ప్రతీ నెలా టాప్‌-5లో ఉంటుంది.. ధర రూ. 11 లక్షలు మాత్రమే!

దేశంలో హ్యుందాయ్‌ కార్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మారుతి సుజుకి తర్వాత ఎక్కువ సంఖ్యలో ఈ సంస్థకు చెందిన కార్లను జనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ కార్లు తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో సహా వివిధ రకాల కార్లను విక్రయిస్తోంది. దీంతో ఈ సంస్థకు చెందిన కార్లు సేల్స్‌లోనూ సత్తా చాటుతున్నాయి. హ్యుందాయ్‌ లోని ఫేమస్‌ ఎస్‌యూవీకి సంబంధించిన ఆగస్టు 2024 సేల్స్‌ రిపోర్ట్‌ వెల్లడి అయ్యింది. ఆ పాపులర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ నెలవారి అమ్మకాల్లో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఆ కారుకి సంబంధించిన సేల్స్‌, పూర్తి వివరాలు ఈ కథనంలో..

హ్యుందాయ్ నుంచి క్రెటా ఎస్‌యూవీ (Hyundai Creta) సేల్స్‌లో దుమ్మురేపుతుంది. ఈ కారు ఆగస్టు 2024 లో మొత్తం 16,762 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదే కారు 2023లో విక్రయించిన 13,832 యూనిట్లతో పోలిస్తే ఇది 21 శాతం అధికం. అంతే కాకుండా ఈ కారు ఎస్‌యూవీ విభాగంలో జూలై 2024 వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది.

Hyundai Creta SUV August sales

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కంపెనీ లైనప్‌లోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. ఈ కారు చాలా సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ .11 లక్షల నుండి రూ .20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది E, EX, S, S (O), SX Tech వంటి 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటితో పాటు నైట్‌ ఎడిషన్‌లోనూ అందుబాటులో ఉంది.

ఈ హ్యుందాయ్ క్రెటా పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 115 ps పవర్‌ని 144 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 ps పవర్, 253 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 116 ps పవర్, 250 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Hyundai Creta SUV August sales Report 2024

ఈ వేరియంట్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఈ కారు 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్‌తో చూపరులను కట్టి పడేస్తుంది. ఈ కారులో వీరిలో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో లగేజీ పెట్టుకోవడానికి 433 లీటర్ల బూట్‌ స్పేస్‌ కలదు. లాంగ్‌ జర్నీలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది.

ఈ కారు 6 మోనోటోన్‌ కలర్స్, 1 డ్యూయల్‌ టోన్‌ కలర్‌ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల పరంగా ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ ప్లేలు (ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ & ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్), డ్యూయల్ జోన్ ఏసీ, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇంకా మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో కలవు.

Hyundai Creta SUV

సేఫ్టీ పరంగా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) ఉన్నాయి. ఈ కారు కియా సెల్టోస్ , మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌ కార్లతో పాటు మార్కెట్‌లో మరెన్నో కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. క్రెటా ఎలక్ట్రిక్ కారు 2025 మార్చిలోపు మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది 400 కి.మీ రేంజ్‌తో రానుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 16, 2024, 7:20 [IST]
English summary
Hyundai creta suv august sales report 2024 check here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+