2015 నుంచి సేల్స్‌లో ఈ కారుదే హవా.. ప్రతీ నెలా టాప్‌లో ఉండే ఈ ఎస్‌యూవీ చాలా ఫేమస్ అండి బాబోయ్!
భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లు దుమ్మురేపుతున్నాయి. ఆ కంపెనీ నుంచి క్రెటా, వెర్నా, ఎక్స్‌టర్, ఆరా, వెన్యూ వంటి ఫేమస్ లైనప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోనే మారుతి సుజుకి తర్వాత ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్న కార్ల కంపెనీగా హ్యుందాయ్ ఉంది. ఆ తర్వాత మహీంద్రా, టాటా కార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. మార్కెట్‌లో ఇతర కంపెనీలతో పోల్చితే ఈ కార్లు సరససమైన ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లను అందిస్తున్నాయి. అందువల్ల మార్కెట్‌లో జనాలు ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు.
హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ప్రతీ ఏడాది రెట్టింపు అమ్మకాలతో సత్తా చాటుతోంది. ఏ కంపెనీకి ఎస్‌యూవీలు కూడా దీని దరిదాపుల్లో కూడా లేవు. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవతున్న 3వ ఎస్‌యూవీగా హ్యుందాయ్ క్రెటా అంటే దీని క్రేజ్‌ని అర్థం చేసుకోండి. 2015లో మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ ఎస్‌యూవీ ప్రతీ ఏడాది సేల్స్‌లో సత్తా చాటుతున్నాయి. ఈ ఎస్‌యూవీని లాంచ్ చేసిన సంవత్సరంలోనే మొత్తం 40,952 యూనిట్లు సేల్‌తో రికార్డు తిరగరాసింది.

ఈ ఏడాది కూడా క్రెటా ఎస్‌యూవీ అదరగొడుతోంది. ఇప్పటి వరకూ దీని ఫర్ఫామెన్స్‌ని గమనిస్తే ఈ సంవ్సత్సరంలో అత్యధిక సేల్స్‌ని నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తానికి 2015 నుంచి 2024 వరకు దాదాపు 11,23,000 యూనిట్ల సేల్స్‌తో నంబర్ 1 ఎస్‌యూవీగా కొనసాగుతోంది. ఇటీవలె 1 మిలియన్ యూనిట్ల మార్క్‌ని సైతం హ్యుందాయ్ ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకుంది.
అక్టోబర్ 2024 అమ్మకాల్లోనూ ఈ కారు నంబర్ 1గా నిలిచింది. అక్టోబర్‌లో మొత్తం 17,497 యూనిట్ల సేల్స్‌ని సాధించింది. గత ఏడాది అక్టోబర్‌లో కేవలం 13,077 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. గత ఏడాది సేల్స్‌తో పోల్చితే 34 శాతం అమ్మకాలు పెరిగాయి. రానున్న రోజుల్లో దీని సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.

ఈ ఎస్‌యూవీ మార్కెట్‌లో సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధరలు రూ .11 లక్షల నుంచి రూ .20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారుని E, EX, S, S (O), SX Tech అనే 7 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది నైట్ ఎడిషన్‌లోనూ లభిస్తుంది.
ఇక ఈ హ్యుందాయ్ క్రెటా పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంటుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 115 ps పవర్‌ని, 144 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 ps పవర్‌ని, 253 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 116 ps పవర్, 250 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ 7-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి వస్తాయి. ఇక మైలేజీ పరంగా ఈ కారు 17.4 నుంచి 21.8 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారులో 5 మంది ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో లగేజీని క్యారీ చేయడానికి 433 లీటర్ల బూట్ స్పేస్ కలదు.
ఈ కారుని 6 మోనోటోన్, 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఫీచర్ల పరంగా చూస్తే 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ ప్లేలు (ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ & ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్), డ్యూయల్ జోన్ ఏసీ, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.
సేఫ్టీ పరంగా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రెటా మార్కెట్‌లో నేరుగా కియా సెల్టోస్ , మారుతి సుజుకి గ్రాండ్ విటారా , టయోటా హైరైడర్ వంటికి గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం క్రెటాను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకురానుంది. 2025 మార్చిలో ఇది మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 400 కి.మీ రేంజ్‌ని అందించనుంది.


Click it and Unblock the Notifications








