Hyundai Creta Sales: మార్కెట్లో ఈ కారుకు పిచ్చ క్రేజ్‌.. 10 లక్షల యూనిట్ల సేల్స్‌తో రికార్డు..!

దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. విక్రయాల్లో దూసుకుపోతోంది. హ్యుందాయ్‌కు చెందిన ప్రముఖ మోడల్‌ క్రెటా ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల సేల్స్‌ మైలురాయిని చేరుకుంది. కాగా హ్యుందాయ్‌ క్రెటా మోడల్‌ మొదటిసారిగా భారత మార్కెట్లో 2015లో లాంచ్‌ అయింది.

దేశంలో ఎస్‌యూవీలకు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్ సైజ్ ఎస్‌యూవీలలో హ్యుందాయ్‌ క్రెటా టాప్‌లో ఉంది. మెరుగైన పనితీరు, ఆకట్టుకునే డిజైన్‌, అధునాతన ఫీచర్లతో Hyundai Creta Mid Size SUV భారత కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Hyundai-Creta-Sales-In-India

కాగా ఇటీవల హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ కూడా లాంచ్‌ అయిన విషయం తెలిసిందే. హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌.. కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎంజీ ఆస్టర్‌లకు మార్కెట్లో గట్టి పోటీనిస్తోంది. 2015 నుంచి ఇప్పటివరకు 10 లక్షల సేల్స్‌తో వివాదరహిత బ్రాండ్‌గా నిలిచిన క్రెటా స్పెషాలిటీస్‌ ఏంటో తెలుసా.??

భారత్‌లో హ్యుందాయ్‌ ఇప్పటివరకూ.. 10 లక్షల యూనిట్ల క్రెటాలను విక్రయించగా విదేశాలకు 2 లక్షల 80 వేల యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ మేరకు క్రెటాపై కస్టమర్‌లు చూపిస్తున్న ఆదరణ, విశ్వాసానికి హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఓఓ తరుణ్ గార్గ్ కృతజ్ఞుతలు తెలియజేశారు. భారతీయ రోడ్లపై ఒక మిలియన్ క్రెటా ఎస్‌యూవీలతో క్రెటా బ్రాండ్ వివాదరహిత ఎస్‌యూవీగా తన వారసత్వాన్ని పునరుద్ఘాటించిందని వెల్లడించారు.

Hyundai-Creta-Sales-In-India

దేశీయ మార్కెట్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక క్రెటా మోడల్‌ను విక్రయిస్తున్నట్లు హ్యుందాయ్‌ మోటార్ ఇండియా వెల్లడించింది. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన పనితీరు, అత్యుత్తమ క్లాస్ సౌకర్యం, అత్యాధునిక సాంకేతికత, ఫీచర్లతో కస్టమర్ల ప్రశంసలు అందుకుంది. గత ఎనిమిదేళ్లుగా ఈ కొరియన్‌ బ్రాండ్‌ మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ మార్కెట్లో తన సత్తా చాటుతోంది.

'మేక్ ఇన్ ఇండియా' నినాదం పట్ల హ్యుందాయ్ మోటార్ ఇండియా తన నిబద్ధతను ప్రదర్శిస్తోందని తరుణ్‌ గార్గ్‌ స్పష్టం చేశారు. కాగా హ్యుందాయ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,366 విక్రయ కేంద్రాలను మరియు 1,549 సేవా కేంద్రాలను కలిగి ఉంది. అంతేకాకుండా బలమైన మోడల్ లైనప్ హ్యుందాయ్ సెగ్మెంట్లలో 13 కార్ మోడళ్లను కలిగి ఉంది.

Hyundai-Creta-Sales-In-India

ప్రస్తుతం భారత మార్కెట్లో గ్రాండ్ i10 NIOS, i20, i20 N లైన్, ఆరా, వెర్నా, క్రెటా, అల్కాజర్, టక్సన్, ఎక్స్‌టర్, వెన్యూ, వెన్యూ-ఎన్ లైన్, కోనా ఎలక్ట్రిక్ మరియు ఆల్-ఎలక్ట్రిక్ SUV ఐయోనిక్ 5 మోడళ్ల వంటి అత్యుత్తమ వాహనాలను సంస్థ విక్రయిస్తోంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో గత నెలలో హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ విడుదలైంది. ఇందులో అధునాతన అప్‌డేట్లను తీసుకువచ్చారు. ఈ కొత్త మోడల్ ఇప్పటికే 60వేల కన్నా ఎక్కువ బుకింగ్‌లను సంపాందించుకుంది. కాగా హ్యుందాయ్ క్రెటాను ప్రస్తుతం రూ. 10,99,900 నుంచి రూ. 20,14,900 (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో కొనుగోలు చేయవచ్చు.

Hyundai-Creta-Sales-In-India

హ్యుందాయ్‌ క్రెటా ప్రస్తుతం మూడు ఇంజిన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్‌.. 115 PS వద్ద 144 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్‌ 160PS వద్ద 253 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hyundai-Creta-Sales-In-India

హ్యుందాయ్‌ క్రెటా మరో ఇంజిన్‌ 1.5-లీటర్ U2 CRDI డీజిల్.. 116PS వద్ద 250 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 6-స్పీడ్ ఎంటీ, ఐవీటీ ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఏటీ అనే నాలుగు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను సంస్థ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 20, 2024, 12:24 [IST]
English summary
Hyundai creta suv reaches 10 lakhs units sales milestone in india check full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+