మంచి మైలేజీ ఇచ్చే పాపులర్ కారు.. ఫీచర్లు 'వీర లెవల్', పైసకు తగ్గట్లు ఫీచర్లు
ఈ సంవత్సరం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని విడుదల చేయడంతో మంచి స్వింగ్‌లో దూసుకుపోతుంది. ఈ కారులో ఉన్న ఫీచర్లు ఇతర కార్ల కంటే అధికంగా ఉండటంతో సేల్స్‌లో వీటికి తిరుగులేకుండా పోయింది. ఏప్రిల్ 2024లో క్రెటా 15,447 యూనిట్లను విక్రయించింది. ఆ కారుకి దరిదాపుల్లో కూడా ఏ కార్లు లేవు.
మారుతి గ్రాండ్ విటారా 7,651 యూనిట్ల సేల్స్‌తో 2వ స్థానంలో ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా కారు 39.76 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ పాపులర్ కారుని కొనేందుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ కారు వెయింటింగ్ పీరియడ్ 4-5 నెలలుగా ఉంది. ఈ కారు ధరలు రూ.. 10.99 లక్షల నుంచి రూ. 20.14 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

అయితే ఏ కారు కొనేముందు జనాలు వేరియంట్ బుక్ చేసుకోవాలనే సమస్య వెంటాడుతోంది. దీనిపై డీలర్‌షిప్ లేదా ఇంటర్‌నెట్‌లో సరైన వివరణ మీకు లభించక పోవచ్చు. అందుకే ఈ కథనంలో క్రెటాలో లభించే ప్రతి వేరియంట్ ఫీచర్లను మీకు తెలియజేయనున్నాం. కారులోని ఉత్తమ ఫీచర్ల ఆధారంగా మీరు ఏ కారుని కొనుగోలు చేయాలో మీరే నిర్ణయించుకోండి.

E వేరియంట్: ఇది పాపులర్ ఎస్‌యూవీలోని బేస్ వేరియంట్. బేస్ వేరియంట్‌లో ప్రొజెక్టర్ హెడ్ లైట్లు, ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ESP (Electronic Stability Programme), టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), రియర్ డిస్క్ బ్రేక్స్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ ఏసీ వెంట్స్, ప్రయాణికులందరికీ త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఇందులో కలర్ ఇన్ స్ట్రుమెంట్ స్క్రీన్ కూడా ఉంది.
EX వేరియంట్: ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ రియర్ స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, షార్క్-ఫిన్ యాంటెనా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్‌వీఎం (Outside Rear View Mirror)లు, మ్యాప్ లైట్లు, సన్ గ్లాసెస్ హోల్డర్ ఉన్నాయి.

S వేరియంట్: ఈ వేరియంట్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, OVRM లపై LED ఇండికేటర్లు, ఆటోమేటిక్ హెడ్‌లైట్స్, రియర్ డీఫాగర్, రియర్ కెమెరా, రియర్ సన్ బ్లైండ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వైపర్, లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఉన్నాయి.
SX వేరియంట్: ఇది మునుపటి వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇందులో 17 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్ ఉన్నాయి. డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకులు, డ్రైవ్ మోడ్స్, ప్యాడిల్ షిఫ్టర్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో లభిస్తాయి. అదనంగా, ఈ వేరియంట్ పుష్-స్టార్ట్ బటన్ మరియు రియర్ రీడింగ్ లైట్లను కలిగి ఉంటుంది.

SX (O) వేరియంట్: ఇందులో 17 అంగుళాల రేజర్ కట్ అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లు, సెమీ లెదర్ అప్‌హోల్స్టరీ, లెదర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ ఉన్నాయి. ఇంటీరియర్స్‌లో యాంబియంట్ లైటింగ్, వైర్ లెస్ ఛార్జింగ్, వెనుక సీట్ల కోసం హెడ్ రెస్ట్ కుషన్, వాయిస్ యాక్టివేటెడ్ సన్ రూఫ్ ఉన్నాయి.
SX(O) ఎగ్జిక్యూటివ్ వేరియంట్: ఈ వేరియంట్‌లో మరిన్నీ సేఫ్టీ ఫీచర్లున్నాయి. ఈ వేరియంట్లో ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) సూట్, కొలిషన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వేరియంట్లలో బోస్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ బ్రేకులు, డ్రైవ్ మోడ్‌లో మరియు ప్యాడిల్ షిఫ్టర్లు కూడా ఉన్నాయి.

SX(O) టెక్ వేరియంట్: ఈ టాప్-స్పెక్ వేరియంట్లో మునుపటి వేరియంట్లలోని అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రోక్రోమిక్ ఇన్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ (IRVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల కెమెరా సిస్టమ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఎలక్ట్రికక్‌గా అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉన్నాయి.
పైన తెలిపిన ఫీచర్లు వేరియంట్ మీ అవసరాలు మరియు బడ్జెట్‌పై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఈ కారు టాప్‌లో కొనసాగుతుంది. మీ అవసరానికి సరిపడా ఫీచర్లు ఉన్న కార్లను ఎంచుకుని మంచి ప్రయాణాన్ని సాగించండి. అలాగే హ్యుందాయ్ డీలర్‌షిప్‌ని సందర్శించడానికి ముందు వివిధ వేరియంట్లను టెస్ట్ డ్రైవ్ చేసి సరైన వేరియంట్‌ని కొనుగోలు చేయండి. పైన తెలిపిన వివరాలు మీ కారు ఎంపికలో కొద్దిమేర సహాయ పడతుందని మేము భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








