అందరూ ఇష్టంగా కొంటున్న ఏకైక కారు.. ఈ సంవత్సరంలో ఏకంగా 1 లక్షా 87 వేల మంది కొనేశారు!

హ్యుందాయ్ క్రెటా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో గత కొన్ని సంవత్సరాలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా ఉంది. ఈ విభాగంలో మరే ఇతర కార్లు దీని దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం. ఎప్పటివలె 2024 లోనూ హ్యుందాయ్ క్రెటా అదరగొట్టింది. మొత్తం 1,87,200 యూనిట్లతో హ్యుందాయ్‌ దుమ్మురేపింది. ఇక ఈ నెలలో 13,000 వరకు కార్లు అమ్ముడవుతాయని అంచనా వేయడంతో అమ్మకాలు 2,00,000 మార్కును దాటే అవకాశం ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ కారుకి సంబంధించిన సేల్స్‌, ఇతర పూర్తి వివరాలు ఈ కథనంలో మీకోసం..

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్లలో హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో ముందంజలో ఉంది. ఇది అధునాతన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో మార్కెట్‌లోకి వస్తుంది. ఈ కారుని E, EX, SX, S, S (O), SX Tech, SX (O) అనే 7 వేరియంట్లలో లభిస్తుంది. దీనికి మార్కెట్‌లో ప్రత్యేక ఫ్యాన్‌బేస్‌ ఉంది. ఇందులోని ఒక్కో మోడల్‌లో లెవల్ -2 ఏడీఏఎస్‌తో సహా 70 అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Creta Sales

సేఫ్టీ, కంఫర్ట్ పరంగా హ్యుందాయ్ ఈ కారుని అధునాతనంగా తీర్చిదిద్దింది. దీని ముందు భాగంలో ఢిఫరెంట్‌ గ్రిల్‌ ఉంటుంది. మధ్యలో లోగో, L-ఆకారంలో DRLsతో వస్తుంది, ఇది టాప్ వేరియంట్లతో పోల్చితే ఢిఫరెంట్‌గా కనిపిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్ బేస్ మోడల్‌లోనూ లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. డ్యాష్ బోర్డ్ డిజైన్ వేరియంట్ లోపల ఒకే విధంగా కనిపిస్తుంది.

మాన్యువల్ IRVS, మాన్యువల్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంలు, అన్ని విండోస్‌ పవర్‌తో వస్తాయి. ఇందులో సెంటర్ లాకింగ్, టర్నింగ్ కీ, ఫ్రంట్ సెంటర్ హ్యాండ్ హ్యాండ్లర్, రియర్ హ్యాండ్ హోల్డర్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్, కారులోని ప్రయాణికులందరికీ 3 పాయింట్స్‌ సీట్ బెల్ట్, రియర్ ఏసీ వెంట్స్, క్లాత్ సీట్స్‌ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు కలవు. అందువల్ల ఈ క్రెటా కారు కస్టమర్లకు అత్యంత చేరువ అయ్యింది.

Hyundai Creta

ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని NA పెట్రోల్, డీజిల్ రెండూ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. మెరుగైన పనితీరుక కోరుకునే వారు నచ్చిన ఇంజిన్‌ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. ఇక త్వరలో జరగబోయే మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ ఈవీ కారు 2025 లోనే అమ్మకానికి రానుంది.

ఈ హ్యుందాయ్‌ క్రెటా ఎంజీ ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్‌, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్, సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది. పైన తెలిపిన వాటితో పోల్చితే ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత గట్టి పోటీని ఇస్తుంది. కొత్తగా కారు కొనేవారు సైతం ఈ మోడల్‌ని కళ్లు మూసుకుని కొనుగోలు చేయవచ్చు.

Hyundai Creta EV

డ్రైవ్‌స్పార్క్ ఒపీనియన్: భారతీయ మార్కెట్లోనే హ్యుందాయ్ క్రెటా ఆకట్టుకునే ఫీచర్లు, క్రేజీ డిజైన్‌, మంచి ఫర్ఫామెన్స్‌కి నిదర్శనంగా ఉంది. దీనిలోని ఆకట్టుకునే ఫీచర్లు సేల్స్‌లో టాప్‌లో నిలిపేందుకు సహాయపడ్డాయి. ఇక త్వరలోనే రాబోయే ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అధునాతన ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. దీంతో ఎలక్ట్రిక్‌ విభాగంలోనూ ఈ క్రెటా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించనుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, December 29, 2024, 7:20 [IST]
English summary
Hyundai creta top selling sub compact suv segment in 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+