ఇది కదా గుడ్‌న్యూస్‌ అంటే!.. కనీవినీ ఎరుగని 'Hyundai' డిస్కౌంట్స్..

ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు కారు కొనుగోలు చేయాలనుకునే వారికి హ్యుందాయ్ ఓ శుభవార్త చెప్పింది. ఈ నెలలో ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. కంపెనీ అందించే డిస్కౌంట్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ ఈ నెలలో (మార్చి 2024) ఆరా (Aura), గ్రాండ్ ఐ10 నియోస్ (Grand i10 Nios), వెన్యూ (Venue) మరియు ఐ20 (i20) వంటి కార్ల కొనుగోలుపైన భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే బ్రాండ్ యొక్క క్రెటా, ఎక్స్‌టర్, వెర్నా, అల్కజార్, ఐయోనిక్ 5 మరియు టక్సన్ వంటి కార్ల మీద ఎటువంటి డిస్కౌంట్స్ లేదా బెనిఫీట్స్ లభించవు.

Hyundai Grand i10 NIOS

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీ యొక్క సరసమైన మోడల్ 'గ్రాండ్ ఐ10 నియోస్' కొనుగోలుపైన ఇప్పుడు గరిష్టంగా 43000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతుంది.

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)

హ్యుందాయ్ ఆరా కొనుగోలుపైన ఈ నెలలో కస్టమర్లు రూ. 33000 వరకు ప్రయోజనాలను మరియు డిస్కౌంట్స్ పొందవచ్చు. ఆరా యొక్క అన్ని వేరియంట్ల మీద ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి. రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.05 లక్షల మధ్య లభించే ఈ కారు దేశీయ విఫణిలో టాటా టిగోర్, హోండా అమేజ్ మరియు మారుతి సుజుకి డిజైర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Hyundai Venue

హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue)

దేశీయ మార్కెట్లో కియా సోనెట్ మరియు మారుతి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న హ్యుందాయ్ వెన్యూ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 30000 వరకు డిస్కౌంట్స్ పొందవచ్చు. రూ. 7.94 లక్షల నుంచి రూ. 13.48 లక్షల మధ్య లభించే ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు.

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)

హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐ20 కొనుగోలుపైన కస్టమర్ ఈ నెలలో రూ. 25000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 7.04 లక్షల నుంచి రూ. 11.21 లక్షల మధ్య ఉన్న ఈ కారు మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ మరియు మారుతి బాలెనొ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఐ20 మోడల్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

Hyundai i20

హ్యుందాయ్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ.. భారతీయ విఫణిలో తన ఉనికిని చాటుకుంటూ ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కార్లను మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా కస్టమర్లకు తమ ఉత్పత్తులను మరింత చేరువ చేసే నేపథ్యంలో ప్రస్తుతం ఆఫర్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ నెలలో హ్యుందాయ్ కారు కొనేవారికి ఈ ప్రయోజనాలు అందుతాయి.

Note: హ్యుందాయ్ కంపెనీ అందించే డిస్కౌంట్స్ కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం చేయబడినట్లు సమాచారం. కావున ఈ నెలలో పైన వెల్లడించిన కార్లను కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. అంతే కాకుండా డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 9, 2024, 9:03 [IST]
English summary
Hyundai discounts on venue i20 aura and i10 nios this month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+