రూ. 6 లక్షలకే సన్‌రూఫ్‌, 27 కి.మీ మైలేజీ.. చిన్న ఫ్యామిలీలకు ఫర్ఫెక్ట్‌ మైక్రో SUV

భారత్‌లో హ్యుందాయ్‌ కార్లు మంచి మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ సరసమైన ధరలో ఎస్‌యూవీలను అందిస్తోంది. ఇతర కంపెనీ కార్లతో పోల్చితే ఈ సంస్థ అందిస్తున్న కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ లైనప్‌ నుంచి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్ మార్కెట్‌లో కొనుగోలుకి సిద్ధంగా ఉంది. మైక్రో SUV సెగ్మెంట్‌లో టాటా పంచ్‌కు ప్రత్యర్థిగా ఈ కారును ప్రత్యర్థిగా హ్యుందాయ్ సంస్థ విడుదల చేసింది. సరసమైన ధరలో లభించే హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో భారీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మంచి మైలేజీ అందించండంతో పాటు ఈ కారు ఉత్తమ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ కథనంలో కారుకి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

హ్యుందాయ్‌ నుంచి అందుబాటులో ఉన్న మైక్రో SUV రెండు ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక ఇంజిన్‌ 1.2-లీటర్, 4-సిలిండర్ (పెట్రోల్)తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 81.8 bhp వద్ద 113.8 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ కారు CNG మోడ్‌లో 67.7 bhp వద్ద 95.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Hyundai-Exter-Features

పెట్రోల్ వెర్షన్‌లో మ్యాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. CNG వెర్షన్‌లో మాన్యువల్ (5 స్పీడ్) గేర్‌బాక్స్‌ను పొందుతుంది. ఇక హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్‌తో నడిచే కారు 19.2km/l - 19.4km/l ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. CNG కారు గరిష్టంగా 27.1km/kg మైలేజీని ఇస్తుంది.

ఈ Xter మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులోని సీట్ల మధ్య స్పేస్‌ మరియు ఇతర సౌకర్యాలు లాంగ్ డ్రైవ్‌లో సౌకర్యవంతంగా వెళ్లేందుకు ఉంటుంది. లాంగ్‌ జర్నీలో ఈ కారు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. ఈ కారు రూ. 6 లక్షల నుంచి రూ.10.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు మంచి ఆప్షన్‌.

Hyundai-Exter-Rear-Views
ఈ కారులోని కొన్ని డిజైన్ మరియు ఫీచర్లు గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఆరా సెడాన్ లాగా ఉంటాయి. కంపెనీ ఎక్స్‌టర్ ఎస్‌యూవీని డిఫరెంట్ లుక్‌తో డిజైన్ చేసింది. ఫ్రంట్ ఎండ్ చాలా సరికొత్తగా ఉంటుంది. స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్ మరియు పారామెట్రిక్ గ్రిల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పారామెట్రిక్ గ్రిల్‌కి ఇరువైపులా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. H-ఆకారపు LED DRLలు కారుకి అదనపు లుక్‌ని ఇస్తాయి.

హ్యుందాయ్ Xter SUV 15-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బాడీ క్లాడింగ్స్‌ చూడటానికి బెస్ట్‌ డిజైన్‌గా ఉంటాయి. వెనుక భాగం అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. టెయిల్‌లైట్లు హ్యుందాయ్ బ్యాడ్జ్‌కి కనెక్ట్ చేయబడ్డాయి. ఇది కాకుండా, ఇది సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ మరియు బ్లాక్ కలర్ రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌ను కలిగి ఉంది. ఇందులోని సన్‌రూఫ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

Hyundai-Exter-Price

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 10, 2024, 15:54 [IST]
English summary
Hyundai exter best mileage and top class features car in micro suv segment
Read more on: #hyundai motors #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+