ఈ కారుపై తొలిసారిగా హ్యుందాయ్ అదిరిపోయే ఆఫర్.. కస్టమర్లకు ఇదే మంచి సమయం

దేశంలో హ్యుందాయ్ కార్లకు డిమాండ్ భారీగా ఉంటుంది. అందుకే ప్రతి నెలా సేల్స్ పరంగా హ్యుందాయ్ మోటార్స్ టాప్ 4 లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఈ కంపెనీకి చెందిన ప్రముఖ SUV ఎక్స్‌టర్ పై ఈ నెలలో భారీ ఆఫర్లను సంస్థ ప్రకటించింది. మరి ఈ కారుపై సంస్థ అందిస్తున్న ఆఫర్ల వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం..

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీదారులలో ఒకటైన హ్యుందాయ్, మే 2024 నెలలో తన ప్రముఖ కార్లలో కొన్నింటిపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. దీని ప్రకారం, మే నెలలో ఆఫర్ వర్తించనున్న హ్యుందాయ్ కార్ల జాబితాలో i20, Grand i10 Nios, Venue మరియు Exter ఉన్నాయి.

Offers-On-Hyundai-Exter

హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్ అయిన తర్వాత ఈ కారుపై సంస్థ ఆఫర్ అందించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. హ్యుందాయ్ ప్రకటించిన ఈ ఆఫర్‌లలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లు వంటివి ఉన్నాయి. కానీ, ఎక్స్‌టర్ కారుకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ మాత్రమే అందించడం గమనార్హం.

అంటే Exter కారును కొనుగోలు చేసే కస్టమర్‌లు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను మాత్రమే పొందగలరు. పాత కారును ఎక్స్ఛేంజ్ చేసి కొత్త Exter ను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ మేలో పాత కారు విలువపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చని సంస్థ చెబుతోంది. ఇది ఎక్స్‌టర్ కారు అమ్మకాలను మరింత పెంచుతుందని హ్యుందాయ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Offers-On-Hyundai-Exter

కాగా హ్యుందాయ్ ప్రస్తుతం ప్రతి నెలా సగటున 8,000 ఎక్స్‌టర్ కార్లను కార్లను విక్రయిస్తోంది. మొత్తం 17 రకాల ట్రిమ్ లెవెల్స్‌లో లభ్యమవుతున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు ప్రస్తుతం రూ.6.13 లక్షల నుండి రూ.10.28 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

హ్యుందాయ్ Exter 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 83 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికలతో జత చేయబడింది. పెట్రోల్ ఎంపికతో పాటు, Exter కారు CNG ఆప్షన్లో కూడా విక్రయించబడుతోంది. ఇంకా Exter CNG కారు గరిష్ఠంగా 68 bhp శక్తిని మాత్రమే పొందుతుంది.

Offers-On-Hyundai-Exter

అలాగే, Exter CNG కారును మాన్యువల్ ఎంపికతో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఎక్స్‌టర్ కంటే కొంచెం పెద్దదైన హ్యుందాయ్ వెన్యూపై రూ.35,000 వరకు ఆఫర్‌లను అందిస్తోంది. ఇందులో రూ.25,000 వరకు క్యాష్‌బ్యాక్ మరియు రూ.10,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కోసం రూ.48,000 వరకు ఆఫర్‌లను పొందవచ్చు. ఇందులో రూ.3,000 విలువైన కార్పొరేట్ బోనస్ ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కోసం రూ.45,000 వరకు ఆఫర్‌లను ప్రకటించింది. కానీ, ఇది నార్త్, వెస్ట్ మరియు మధ్య భారత రాష్ట్రాల్లోని కస్టమర్లు మాత్రమే పొందగలరు.

Offers-On-Hyundai-Exter

సౌత్ ఇండియా మరియు ఈస్ట్ ఇండియాలో i20 కొనుగోలుదారులు రూ. 35,000 వరకు మాత్రమే డిస్కౌంట్లను పొందుతారని తెెలుస్తోంది. కాగా హ్యుందాయ్ తన కార్లపై ఏప్రిల్‌లో కూడా తగ్గింపులను అందించింది. హ్యుందాయ్ గత నెలలో వెన్యూపై రూ. 35,000 ఆఫర్‌ను కొనసాగించింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు ఐ20 కార్లపై గత నెల కంటే ఈ నెలలో అధిక ఆఫర్‌ను ప్రకటించింది. అయితే వీటన్నింటికీ మించి Exter కారుకు ఈ ఆఫర్ అందించడం ఇదే తొలిసారి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని డీలర్ షిప్ ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 9, 2024, 9:32 [IST]
English summary
Hyundai exter gets discounts for the first time in may 2024 check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+