టాటా పంచ్‌కి 'పంచ్'.. డ్యూయల్ సిలిండర్ హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ కారు వచ్చేసింది.. ధర కూడా తక్కువే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ డ్యూయల్ సీఎన్‌జీతో నడిచే ఎక్స్‌టర్‌ని విడుదల చేసింది. భారతీయ మార్కెట్‌లోని సీఎన్‌జీ కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ఫేమస్ కారుని సీఎన్‌జీ రూపంలో విడుదల చేసింది. ఈ సీఎన్‌జీ కారు మోడల్లో 2 సిలిండర్ల టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఒక సిలిండర్‌ని మాత్రమే చాలా పెద్ద సైజులో అందించగా, ఇప్పుడు రెండు చిన్న సిలిండర్లలో అందిస్తున్నారు. దీంతో బూట్ స్పేస్ కాస్త పెరిగింది. దీనివల్ల లాంగ్ డ్రైవ్‌లో ఎక్కువ లగ్గేజీ క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పటి వరకు కేవలం టాటా మోటార్స్‌లో డ్యూయల్ సిలిండర్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో కూడా మొదటసారి రెండు సీఎన్‌జీ సిలిండర్లను ప్రవేశపెట్టింది. ఇకపై సీఎన్‌జీ విభాగంలో టాటా మోటార్స్‌తో హ్యుందాయ్ పోటీ పడనుంది. ఎక్స్‌టర్ టాటా పంచ్‌కి పోటీగా ఈ కారుని ప్రవేశ పెట్టింది. టాటా పంచ్ భారత మార్కెట్లో పెట్రోల్, బై-ఫ్యూయల్ మరియు ఎలక్ట్రిక్ (ఈవీ) ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఇక ఎక్స్‌టర్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది కాకుండా, హ్యుందాయ్ త్వరలో ఈ కారు మోడల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఈ కారును ఇన్‌స్టర్ ఈవీతో కలిపి గ్లోబల్ మార్కెట్‌లో పరిచయం చేసింది. ఇది ఎక్స్‌టర్ సీఎన్‌జీ S, SX మరియు SX నైట్ ఎడిషన్ అనే మూడు ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ కారు ప్రారంభ ధర రూ. 8.50 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 9.38 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఈ ఎక్స్‌టర్ అమ్మకాలను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ఎడిషన్‌ని ఆ సంస్థ ఇటీవలె లాంచ్ చేసింది. ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ సాధారణ ఎక్స్‌టర్ కారు మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
నైట్ ఎడిషన్ పేరుకి తగినట్లుగానే ఆకర్షణీయమైన కలర్ మరియు ప్రత్యేక యాక్ససరీలతో అలంకరించబడింది. ఇక సీఎన్‌జీ కారులో కొత్తగా ట్విన్ సిలిండర్లతో పాటు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కూడా ఉంది. ఇది పెట్రోల్ నుంచి సీఎన్‌జీ మరియు సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కి మారేటప్పుడు సజావుగా ఇంజిన్ ఫర్ఫామ్ చేయడానికి సహాయపడుతుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకి ఇప్పటికే దేశంలో మంచి రెస్పాన్స్‌ని కలిగి ఉంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సీఎన్‌జీతో నడుస్తున్నప్పుడు గరిష్టంగా లీటరుకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. మరోవైపు, ఇది పెట్రోల్‌తో నడుస్తున్నప్పుడు లీటరుకు 19.2 కిలోమీటర్ల నుంచి 19.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇటీవల భారతదేశంలో 93,000 అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ కారు ఏడాదిలోపే అధిక మొత్తంలో అమ్మకాలను సాధించి రికార్డు కొట్టింది. ఎక్స్‌టర్ పంచ్ కార్ మోడల్‌కి గట్టి సవాలుని విసురుతోంది. ఈ కారు ఆరు మోనోటోన్ మరియు మూడు డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంటుంది. బేస్ కలర్ ప్యాక్‌లో అట్లాస్ వైట్, కాస్మిక్ బ్లూ, స్టార్రి నైట్, టైటాన్ గ్రే, ఫైరీ రెడ్ మరియు రేంజర్ ఖాకీ ఉన్నాయి.
ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అబిస్ బ్లాక్‌తో అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్‌తో కాస్మిక్ బ్లూ మరియు అబిస్ బ్లాక్‌తో రేంజర్ ఖాకీ ఉన్నాయి. ఈ కారులో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు డ్యూయల్ డాష్ కెమెరాతో లోడ్ చేయబడింది.
ఇక సేఫ్టీలో స్టాండర్డ్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే TPMS, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫుట్‌వెల్ లైటింగ్, మెటల్ పెడల్స్ మరియు పాడిల్ షిఫ్టర్‌లు వంటి ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉన్నాయి. ఈ కారు ఐసీఈ ఇంజిన్ వేరియంట్ బేస్ ధరలు కేవలం రూ. 5.99 లక్షల నుంచే ప్రారంభం అవుతాయి. ఇంత తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించే కారుగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఉంది.


Click it and Unblock the Notifications








