ఒక్క ఏడాదిలో లక్షమంది కొనేశారు!.. అట్లుంటది ఈ కారుపై లవ్వు
భారతదేశంలో ఎన్ని కార్లు, బైకులు లాంచ్ అయినా కొన్ని మాత్రమే ప్రజలను ఆకట్టుకుంటాయి. మరికొన్ని అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. 2023 జులై 10న దేశీయ విఫణిలో రూ. 5.99 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో లాంచ్ అయిన హ్యుందాయ్ (Hyundai) కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ (Exter) అమ్మకాల్లో అరుదైన ఘనతను సాధించింది. మార్కెట్లో అడుగుపెట్టిన సంవత్సర కాలంలో కంపెనీ ఈ రికార్డ్ కైవసం చేసుకుంది. ఇంతకీ ఎక్స్‌టర్ ఎన్ని యూనిట్లు అమ్ముడైంది? నెలకు ఎంతమంది కొనుగోలు చేశారనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
మార్కెట్లో ఏడాది క్రితం సంచలన ధర వద్ద లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ అమ్మకాల్లో సుమారు ఒక లక్ష యూనిట్లకు చేరువయ్యింది. దీన్ని బట్టి చూస్తే లెక్కకు మించిన ప్రత్యర్థులున్నప్పటికీ ఎక్స్‌టర్ దాదాపు లక్ష మంది కస్టమర్లను ఆకర్శించింది అంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ యొక్క మొత్తం SUVల అమ్మకాల్లో ఎక్స్‌టర్ వాటా 18 శాతం కావడం గమనార్హం.

చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ పొందిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కార్లు ఉత్పత్తిని కూడా పెంచింది. ఎక్స్‌టర్ మార్కెట్లో లాంచ్ అయ్యి ఏకంగా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కంపెనీ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ కూడా దేశీయ విఫణిలో ఇటీవలే లాంచ్ చేసింది. ఇందులో కాస్మొటిక్ అప్డేట్స్ భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎక్స్‌టర్ అనేది దాని విభాగంలో హ్యుందాయ్ యొక్క రెండవ ఆఫర్. మార్కెట్ లీడింగ్ కారుగా హ్యుందాయ్ క్రెటా ఒకప్పటి నుంచి మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. దీని తరువాత ఎక్కువ అమ్ముడవుతున్న కారు హ్యుందాయ్ వెన్యూ. 2024 ఆర్థిక సంవత్సరంలో ఎక్స్‌టర్ సేల్స్ 71301 యూనిట్లు. అయితే మొత్తం SUV అమ్మకాల్లో హ్యుందాయ్ వాటా 18 శాతం లేదా 388725 యూనిట్లుగా తెలుస్తోంది.

సబ్ ఫోర్ మీటర్ SUV విభాగంలోని ఎంట్రీ లెవెల్ కేటగిరీకి బలమైన డిమాండ్ ఉంది. ఈ సమయంలో ఎక్స్‌టర్ యొక్క ధరలు ప్రజలను బాగా ఆకర్శించాయి. ప్రతి నెలా ఎంట్రీ లెవల్ SUVలు 20వేలు నుంచి 22వేల యూనిట్ల వరకు విక్రయించబడుతున్నట్లు.. ఇందులో ఎక్స్‌టర్ ముద్ర బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రత్యర్థులకు కూడా తనదైన రీతిలో గట్టి పోటీ ఇచ్చింది. ఇవన్నీ అమ్మకాల పెరుగుదలకు దోహదపడ్డాయి.
హ్యుందాయ్ యొక్క ఎక్స్‌టర్ మాత్రమే కాకుండా టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ వంటి 12 మోడల్స్ ఈ విభాగంలో మంచి అమ్మకాలను పొందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇందులో ఎక్స్‌టర్ ఏడవ స్థానంలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. రాబోయే పండుగ సీజన్లో కూడా మరిన్ని ఉత్తమ అమ్మకాలు పొందుతాయని నివేదికలు చెబుతున్నాయి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్
హ్యుందాయ్ కంపెనీ తన ఎక్స్‌టర్ లాంచ్ అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భాంగానే కంపెనీ నైట్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆధునిక హంగులను పొందుతుంది. ఇది కొత్త కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. డిజైన్ అప్డేట్ పొందినప్పటికీ.. అదే ఇంజిన్, అదే పర్ఫామెన్స్ ఉందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








