27 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారుకి డిమాండ్ చాలా ఎక్కువ.. క్లాసీ డిజైన్, సూపర్ ఫీచర్లు, ధర రూ. 6 లక్షలు!
దేశంలో మైక్రో ఎస్‌యూవీలకు రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుంది. చిన్న ఫ్యామిలీలకు సరిపోయేడిజైన్, స్టైలింగ్‌తో ఇవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ మైక్రో ఎస్‌యూవీలలో టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ మంచి ఆప్షన్‌గా ఉన్నాయి. జనాలు కూడా ఈ కార్లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండిట్లోనూ మంచి ఫీచర్లు, సౌకర్యాలు ఉన్నాయి. ఇతర ప్రత్యర్థి కార్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఉంది. ఇందులోని సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, బిగ్ బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. చిన్న కుటుంబం కోసం చూస్తున్నట్లైతే ఎక్స్‌టర్ మీకు మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
ఈ కారు 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 83 ps, 114 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT ఆప్షన్‌తో వస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ - సీఎన్‌జీ ఆప్షన్ 69 ps, 95 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

ఇది మీరు ఎంచుకున్న ఇంజిన్ ఆప్షన్‌ని బట్టి హ్యుందాయ్ ఎక్స్‌టర్ మైలేజీ మారుతుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ AMT లీటర్‌కి 19.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ MT లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే 1.2-లీటర్ పెట్రోల్ + సీఎన్‌జీ ఇంజిన్ కిలోకు 27.1 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఈ కారు మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభిస్తుంది. ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ నైట్ వేరియంట్లలో మాత్రమే సీఎన్‌జీ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. మిగిలిన SX, SX (0), S, S+, S (0), S (0)+, SX, SX(0), SX (0) కనెక్ట్‌తో వస్తాయి. నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (0) కనెక్ట్ వేరియంట్ల ద్వారా వస్తుంది.

ఇందులోని కనెక్టెడ్ కార్ టెక్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ అండ్ ఆటో ఏసీ, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో మీరు ఎంచుకున్న వేరియంట్‌ని బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్ క్యామ్ కూడా ఉంది.
ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ ఉన్నాయి. దీని ధరలు రూ .6 లక్షల-రూ.10.43 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. సీఎన్‌జీ వేరియంట్ల ధర రూ.8.50 లక్షల నుంచి రూ.9.38 లక్షలు. (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

సెప్టెంబర్‌లో 8,908 హ్యుందాయ్ ఎక్స్‌టర్ కార్లు సేల్ అయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 8647 సేల్స్‌తో పోల్చితే 20.11 శాతం సేల్స్ తగ్గాయి. మొత్తం హ్యుందాయ్ సేల్స్‌లో క్రెటా, ఆరా తర్వాత అత్యధికంగా అమ్ముడువుతున్న కారుగా ఉంది. మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ తర్వాత హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కి మంచి డిమాండ్ ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








