బడ్జెట్ ప్రీమియం కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఇప్పుడు సరికొత్త వెర్షన్‌లో విడుదల..
భారతదేశంలో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అందులో భాగంగా కంపెనీలు ఈ ఉత్పత్తులు, అప్‌గ్రేడ్స్‌పైన దృష్టి సారిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా హ్యుందాయ్ మోటార్స్ సీఎన్‌జీ వెర్షన్‌లో తమ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఫేమస్ లైనప్స్‌ని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రధాన మోడళ్లలో సీఎన్‌జీ ఆప్షన్‌ని అందిస్తోంది. తాజాగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లో డ్యూయల‌్ సీఎన్‌జీ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..
కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రతీ కంపెనీ డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. హ్యుందాయ్ కూడా నియోస్ ఐ10లో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 7,75,300గా నిర్ణయించింది. ఇది కేవలం ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. ఇంతకుముందు హ్యుందాయ్ ఈ మోడల్‌లో సింగిల్ సిలిండర్‌ని మాత్రమే అందించింది. తాజాగా దీనిని అప్‌గ్రేడ్ చేసింది.

డ్యూయల్ సిలిండర్ ఆప్షన్‌తో ఐ10 నియోస్ బూట్ స్పేస్ పెరగనుంది. నిజానికి ఇప్పటి వరకు ఉన్న బూట్ స్పేస్ సమస్య ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. కాబట్టి ఈ కారులో మీరు ఇకపై అధిక మొత్తంలో లగేజీని తీసుకెళ్లవచ్చు. హ్యుందాయ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ, పెట్రోల్ మరియు సీఎన్‌జీ రెండింటితో నడిచేలా రూపొందించబడింది. కాబట్టి ఇది సీఎన్‌జీ అయిపోయినా మీరు పెట్రోల్ తో ఈ కారులో ప్రయాణించవచ్చు.
హ్యుందాయ్ ఇప్పుడున్న మోడల్ మాదిరిగానే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ మోటారును స్వల్ప మార్పులతో సీఎన్‌జీ ఆధారితంగా రూపొందించారు. గ్రాండ్ ఐ10 నియోస్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు 2019లో లాంచ్ అయినప్పటి నుంచి 4 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. తాజాగా దీనిని డ్యూయల్ సిలిండర్ ఆప్షన్‌తో తీసుకురావడంతో మరొకసారి కొత్త రూపాన్ని సొంతం చేసుకుంది.
ఈ మోడల్ రాబోయే రోజుల్లో ఈ కారు అమ్మకాలను చాలా రెట్లు పెంచుతుందని భావిస్తున్నారు. ఈ డ్యూయల్ సిలిండర్ ఫీచర్ గ్రాండ్ ఐ10 నియోస్ స్పోర్ట్స్ వేరియంట్‌లో కూడా లభిస్తుంది. దీని ధర రూ. 8.30 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ భారతదేశంలో తక్కువ ధరలో లభించే అత్యంత ప్రీమియం కార్లలో ఒకటిగా ఉంది.
ఈ కారు ఫుల్ ప్యాక్డ్ ఫీచర్లతో నిండి ఉంది. ప్రొజెక్టర్ టైప్ హెడ్‌ల్యాంప్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, LED టెయిల్ లైట్లు, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటెనా, 20.25 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెగ్ లైట్లు, ప్రత్యేక రియర్ ఏసీ వెంట్స్, టిల్ట్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇక సేఫ్టీ విషయానికి వస్తే గ్రాండ్ ఐ10 నియోస్ లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, డే-నైట్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఇటీవలె హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో డ్యూయల్ సిలిండర్ ఆప్షన్‌తో సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల చేసింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








