బొమ్మ కారులా ఉందని లైట్ తీసుకోకండి.. దిమ్మతిరిగే ఫీచర్లతో దుమ్మురేపుతుంది!
దేశంలో హ్యుందాయ్ కార్లు సత్తా చాటుతున్నాయి. ఆ కంపెనీకి చెందిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ విభాగంలోనే నంబర్ 1గా కొనసాగుతోంది. ఆ తర్వాత మైక్రో ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ దూసుకెళ్తుంది. ఈ కారు తక్కువ ధరలో సన్‌రూఫ్ ఫీచర్‌ని అందిస్తోంది. అలాగే కొన్ని కార్ల అప్‌డేట్ వెర్షన్‌లతో మార్కెట్‌లో తన ఉనికిని చాటుకుంటోంది. ఇదే జోష్‌లో దేశంలో ఈవీ రంగంలో తనదైన ముద్ర వేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. అందులో భాగంగా ఇన్‌స్టర్ క్రాస్‌ని (Hyundai Inster Cross) ప్రపంచ మార్కెట్‌లో ఆవిష్కరించింది. కొన్ని నెలల క్రితం రివీల్ చేయబడిన ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఇన్‌స్టర్ సరికొత్త స్టైలింగ్స్ అందుబాటులోకి వస్తుంది.
ఈ బేబీ ఈవీ ఆఫ్-రోడ్ సామార్థ్యాలను కూడా కలిగి ఉండటం గమనార్హం. దీనిని సౌత్ కొరియాలోని ప్లాంట్‌లో ఈ ఏడాది చివరి నాటికి తొలి ఉత్పత్తిని ప్రారంభించి పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ క్రాస్ అతి త్వరలో విదేశీ మార్కెట్‌లోకి అందుబాటులో ఉండనుంది. వచ్చే ఏడాది ఆఖర్లో లేదా చివర్లో భారత్‌లో ఈ కారు అడుగు పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి..

ముందుగా దీని బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో స్టాండర్డ్‌గా వచ్చే అవకాశం ఉంది. అలాగే బిగ్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 360 కిలోమీటర్ల రేంజ్ వరకు ఇది ప్రయాణించనుంది. ఈ ఎలక్ట్రిక్ పొట్టి కారు 113 bhp పవర్ అలాగే 147 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ని అమర్చనున్నారు. ఇది ఆఫ్‌రోడ్‌లలోనూ మంచి ఫర్ఫామెన్స్‌ని అందించనుంది.
ఈ కొత్త ఇన్‌స్టర్ 120 కిలోవాట్ల ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు. హ్యుందాయ్ ఇన్‌స్టర్ క్రాస్ డిజైన్ విషయానికొస్తే ఇతర స్టాండర్డ్ కార్ల మాదిరిగానే బేసిక్ డిజైన్‌తో వస్తుంది. అయితే ఎక్స్‌టీరియర్‌లో దీనికంటూ ఓ ప్రత్యేక కాస్మోటిక్ మార్పులతో రానుంది. దీర్ఘచతురస్రాకార ఆకారంలో ముందు అలాగే వెనుక బంపర్ల చుట్టూ బ్లాక్ క్లాడింగ్ ఆకట్టుకోనుంది.

సైడ్ ఫ్రొఫైల్‌లో కొత్త 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, వీల్ ఆర్చర్స్ క్రేజీ లుక్‌ని అందిస్తాయి. ఈ కొత్త ఇన్‌స్టర్ క్రాస్ ఐదు కలర్ ఆప్షన్స్‌తో పాటు ప్రత్యేక అమెజోనస్ గ్రీన్ మ్యాట్ షేడ్‌లోనూ లభిస్తుంది. అట్లాస్ వైట్, అన్బ్లాచ్డ్ ఐవరీ, ఏరో సిల్వర్ మ్యాట్, అబిస్ బ్లాక్ పర్ల్, టామ్ బాయ్ ఖాకీ వంటి ఇతర కలర్ ఆప్షన్స్‌తో లభిస్తుంది.
దీనిలోని అమెజోనియన్ గ్రీన్ మ్యాట్ కలర్ ఆప్షన్ ప్రత్యేకంగా ఆకట్టుకోనుంది. ఎక్స్‌టీరియర్ బ్లాక్ రూఫ్‌తో డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌తో సరికొత్త లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ క్రాస్ అనేక టాప్-సెప్ ఫీచర్లను కలిగి ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 ఇంచెస్ డ్రైవర్ స్క్రీన్ కూడా లభిస్తుంది. ఇక ఇందులో ADAS వంటి ఫీచర్లు సేఫ్టీని అందిస్తాయి.

సేఫ్టీలో హైవే డ్రైవింగ్ అసిస్ట్ 1.5, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్-అవాయిడెన్స్ అసిస్ట్ 1, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్ డేటాతో లేన్ సెంటర్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఇందులో ఫ్రంట్ బెంచ్ సీట్లు, రెండో వరుస సీట్లను మడతపెట్టవచ్చు. ఈ కారు సీట్లను విడివిడిగా ముందుకు, వెనుకకు స్లైడ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
ఇక ఈ కారుకు 280 లీటర్ల బూట్ స్పేస్‌తో రానుంది. రెండో వరుస సీట్లను మడత పెడితే 351 లీటర్లకు బూట్ స్పేస్ పెరుగుతుంది. దీంతో లాంగ్ డ్రైవ్‌లో ఎక్కువ లగేజీని క్యారీ చేయవచ్చు. ఇక కొలతల పరంగా ఈ హ్యుందాయ్ ఇన్‌స్టర్ క్రాస్ 3,825 మిమీ పొడవు, 1,610 మిమీ వెడల్పు, 1,575 మిమీ ఎత్తుతో వస్తుంది.


Click it and Unblock the Notifications








