హ్యుందాయ్ నుంచి 355 కి.మీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ
దేశంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో నంబర్ వన్‌గా ఉంది. దానికి కాంపిటీషన్‌లో హ్యుందాయ్ కార్లను తీసుకువస్తున్నా కానీ టాటా ఈవీలకు గట్టి పోటీని ఇవ్వలేక పోతున్నాయి. అయితే హ్యుందాయ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కోనా(Kona EV) దేశంలో పెద్ద హిట్ కాకపోయినా ఓవర్సీస్‌లో మాత్రం ఈ కారు మంచి డిమాండ్‌ని కలిగి ఉంది. ఈ దక్షిణ కొరియా బ్రాండ్ విదేశాలలో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ లైనప్‌లో ఓ మోడల్‌ని తీసుకురానుంది. 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో ఈ సబ్ కాంపాక్ట్ ఈవీని ఆ సంస్థ ఆవిష్కరించింది.
ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు వినూత్నమైన మరియు బ్రాండ్‌లోని ఇతర ఎలక్ట్రిక్ కార్ల ఆధారంగా రూపొందించినట్లు హ్యుందాయ్ తెలిపింది. హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఎలక్ట్రిక్ రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా కొత్త రికార్డులను నెలకొల్పుతుందని హ్యుందాయ్ పేర్కొంది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ అందించే కార్లు కొనుగోలు చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందని హ్యుందాయ్ తెలిపింది. ఈ కారు గురించి మరింత సమాచారం ఈ కథనంలో..

2021లో కొరియాలో లాంచ్ అయిన కాస్‌పర్ ప్రేరణతో ఈ కారుని తీసుకువచ్చారు. భారీ ఇంటీరియర్ స్పేస్, పొడిగించిన బాడీ మరియు వీల్ బేస్ ఈ ఇన్‌స్టర్‌ని సరికొత్త లుక్‌ని అందించనుంది. ఇన్‌స్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రధానంగా బయటి డిజైన్‌లో రౌండ్ ఎల్‌ఈడీ లైట్స్ దాని చుట్టూ LED DRLలు ఉన్నాయి. అంతే కాకుండా సర్క్యూట్ బోర్డ్-స్టైల్ బంపర్, స్కిడ్ ప్లేట్ పిక్సెల్-గ్రాఫిక్ టర్న్ ఇండికేటర్లను గమనించవచ్చు.
డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరీయర్‌తో ఈ కారు భిన్నమైన బ్లాక్ రూఫ్‌ని కలిగి ఉంది. హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఇంటీరియర్లు కొరియన్ బ్రాండ్స్‌కి అనుగుణంగా ఉండే ఫుల్ ప్యాక్డ్ ఫీచర్లతో నిండి ఉంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, నావిగేషన్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి ఇతర ఫీచర్లు ఇంటీరియర్‌లతో మరింత ప్రీమియంగా ఉంది.

స్టీరింగ్ వీల్ పై పిక్సెల్ థీమ్ ఆధారిత గ్రాఫిక్స్, కస్టమైజబుల్ అప్పర్ డోర్ ట్రిమ్ గార్నిష్‌లు, అన్ని సీట్లకు ఫ్లాట్ ఫోల్డింగ్, ఫ్రంట్ బెంచ్ సీట్ ఆప్షన్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారులోని రెండో వరుస సీట్లను కూడా 50/50 కు మడతపెట్టవచ్చు.
హ్యుందాయ్ ఇన్‌స్టర్ రెండు బ్యాటరీ ప్యాక్స్ ఆప్షన్స్‌తో వస్తుంది. లో-రేంజ్ 42 కిలోవాట్ల లాంగ్ రేంజ్ 49 కిలోవాట్ల బ్యాటరీ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. రెండు మోడళ్లు ఒకే మోటారుతో నడుస్తాయి. కానీ పనితీరులో కాస్త భిన్నంగా ఉండనున్నాయి. ఈవీ బేస్ వేరియంట్ 97 bhp, లాంగ్ రేంజ్ 115 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు 147nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తాయి.

ఫుల్ ఛార్జ్‌లో లాంగ్ రేంజ్ 355 కిలోమీటర్లు, స్టాండర్డ్ వేరియంట్‌లో 300 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తాయి. దీని 120 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ కారని కేవలం 30 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయవచ్చు. అలాగే ఇందులో 11 కిలోవాట్ల ఆన్-బోర్డ్ ఛార్జర్‌ని ప్రామాణికంగా పొందవచ్చు. స్టాండర్డ్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 140 కి.మీ, లాంగ్ రేంజ్ వేరియంట్ 150 కిలోమీటర్లతో ప్రయాణిస్తాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








