టాటా పంచ్ ఈవీ Vs హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ Vs సిట్రోయిన్ ఈసీ3 మధ్య ముఖ్య తేడాలు!
హ్యుందాయ్ నుంచి తక్కువ ధరలో చిన్న ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానుంది. ఈ కారుని 2024 బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో హ్యుందాయ్ ఆవిష్కరించింది. దీనికి ఇన్‌స్టర్ ఈవీగా పిలుస్తోంది. ప్రధానంగా కొరియాలో విక్రయించే ఈ మైక్రో-ఎస్‌యూవీ పూర్తి-ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించనుంది. ఈ కారుని భారత్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారనే విషయాన్ని హ్యుందాయ్ వెల్లడించలేదు. అయితే ఈ కారు మాత్రం భారత్‌లో టాటా పంచ్ ఈవీ మరియు సిట్రోయిన్ ఈసీ3 లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కార్ల మధ్య వత్యాసాలు మీకోసం..
కొలతలు: మూడు కార్లలో 3,981 మిమీలతో పొడవుగా సిట్రోయిన్ ఉండనుంది. టాటా పంచ్ ఈవీ ఎత్తులో 1,742 మిమీతో ఉంది. ఇక ఇన్‌స్టర్ 2,580 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంది. పంచ్ ఈవీ అత్యధికంగా 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇన్‌స్టర్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ని పొందుతుంది. టాటా పంచ్ పంచ్ 16, సిట్రోయిన్ 15 ఇంచెస్ వీల్స్‌ని పొందుతాయి.

మోటార్: ఈ మూడు కార్లలో ఒకే ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ లభిస్తుంది. ఇన్‌స్టర్ మోటార్ బేస్ ట్రిమ్ 9bhp మరియు లాంగ్ రేంజ్ వెర్షన్‌లో 115 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పంచ్ ఈవీ మిడ్-రేంజ్ వేరియంట్లలో 82 bhp మరియు లాంగ్-రేంజ్ వేరియంట్లలో 122 bhp ని విడుదల చేస్తుంది. సిట్రోయెన్ ఈసీ 3 57 bhp మరియు 143 nm టార్క్‌ని రిలీజ్ చేస్తుంది.
బ్యాటరీ: హ్యూండా ఇన్‌స్టర్ 42 kWh, 49 kWh రెండు బ్యాటరీ ప్యాక్స్‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌బై 355 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. టాటా పంచ్ 25 కిలోవాట్ల లేదా 35 కిలోవాట్ల బ్యాటరీతో వరుసగా 315 కి.మీ, 421 కి.మీ సర్టిఫైడ్ రేంజ్‌ని అందించగలదు. సిట్రోయెన్ ఈసీ3 లోని 29.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌లో 320 కి.మీ రేంజ్ ప్రయాణిస్తుంది.

ఛార్జింగ్: 120 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఇన్‌స్టర్‌ని కేవలం 30 నిమిషాల్లో 10-80% ఛార్జ్ చేయవచ్చని హ్యుందాయ్ తెలిపింది. స్టాండర్డ్ 16A ఏసీ ఛార్జర్ స్టాండర్డ్ మోడల్‌తో 4 గంటలు, లాంగ్ రేంజ్ వెర్షన్‌ని 4 గంటల 35 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. టాటా పంచ్ ఈవీ 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 మిన్స్‌లో 10% నుంచి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు.
రెగ్యులర్ 15A ఛార్జర్‌తో పంచ్ ఈవీ మిడ్ రేంజ్‌ని 10-100% నుంచి ఛార్జ్ చేయడానికి 9.4 గంటలు మరియు పంచ్ లాంగ్-రేంజ్ కు 13.5 గంటలు పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో ఈసీ3ని 57 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు, రెగ్యులర్ 15A ఛార్జర్‌ని ఉపయోగించి 10 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది.
అయితే ఇన్‌స్టర్‌లో బాహ్య మరియు అంతర్గత వెహికల్-టు-లోడ్ (V2L) ఫంక్షనాలిటీని కూడా అందిస్తుంది. దీంతో పెద్ద పరికరాలను లేదా ఇతర ఉపకరణాలను ఛార్జింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ మిగతా రెండు ఈవీలలో లభించవు. హ్యుందాయ్ విదేశాల్లోని ఇన్‌స్టర్‌లో ADAS సేఫ్టీ టెక్నాలజీని కూడా అందిస్తోంది. ఈ సేఫ్టీ ఫీచర్లు ఈసీ3 మరియు పంచ్ ఈవీలలో లేవు.
హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఇంకా ధర ప్రకటించలేదు. టాటా పంచ్ ఈవీ MR వేరియంట్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.13.79 లక్షల మధ్య ఉంది. లాంగ్ రేంజ్ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్య ఉంది. సిట్రోయెన్ ఈసీ3 ధర రూ .11.61-రూ .13.41 లక్షల వరకు ఉంటుంది. (అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు).


Click it and Unblock the Notifications








